నాగ చైతన్య మళ్ళీ బుక్కయ్యాడు !

తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకరు. అటు ప్రేమ కధలు ఇటు పోలీస్ కధలను తెరకెక్కించడంలో గౌతమ్ మీనన్ ది ప్రత్యేక శైలి. అయితే ఆయనతో ఓ చిక్కుంది. ఒక సినిమాని ఒకే సారి రెండు భాషల్లో తెరకెక్కించాలని అనుకుంటారు. ఈ విషయంలో ఆయనది ప్రత్యేకమైన స్ట్రాటజీ. అయితే ఈ స్ట్రాటజీ సరిగ్గా వర్క్ అవుట్ కాకపొతే .. రిజల్ట్ ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాల తయారౌతుంది.

రెండు భాషలు. ఇద్దరు హీరోలు . వాళ్ళ డేట్స్.. లోకేషన్స్.. అబ్బో.. చాలా తలనొప్పి వ్యవహారం. ఇప్పుడు ఆయన ఏకంగా నాలుగు భాషల్లో ఓ సినిమాని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో ఓ లవ్ స్టొరీ ప్లాన్ చేస్తున్నాడు గౌతమ్. తెలుగు విషయానికి వస్తే.. నాగచైతన్య ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. మరి, ఈ సినిమా చైతుకు ఏం’మాయచేశావే’ లాంటి తీపి గురుతుగా మిగులుతుందా లేదా’సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలా బుక్ అయిపోతాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.