‘గాయ‌త్రి’ ఆడియో ఫంక్ష‌న్‌లో ఛ‌మ‌క్కులు

మోహ‌న్‌బాబు సినిమా ‘గాయ‌త్రి’ ఆడియో ఫంక్ష‌న్ ఈరోజు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. సాధార‌ణంగా ఆడియో ఫంక్ష‌న్ అంటే గ్రూపు డాన్సులు, స్కిట్ల‌తో హోరెత్తిస్తారు. వాటిని మాత్రం ‘గాయ‌త్రి’ ప‌క్క‌న పెట్టింది. అయితే… ఒకొక్క‌రూ స్పీచులు తెగ దంచేశారు. అందులో కొన్ని ఛ‌మ‌క్కులు కూడా వినిపించాయి.

* మోహ‌న్‌బాబు ప‌న‌స పండులాంటివాడు.. పైన ముళ్లు.. లోప‌ల తీయ‌ని ప‌స‌న తొన‌లు : త‌నికెళ్ల భ‌ర‌ణి

* మోహ‌న్ బాబు పైనాపిల్‌లాంటివారు.. పైన ముళ్లు.. లోప‌లంతా తీయ‌గా ఉంటుంది: అన‌సూయ‌

* అన‌సూయ మాట్లాడుతూ మాట్లాడుతూ… మోహ‌న్ బాబుని `బావ‌గారూ` అనిపిలిచింది.. ఆ త‌ర‌వాత దాన్ని `బాబు గారు`గా మార్చింది

* నేనుకాలేజీలో చ‌దువుకునే రోజుల్లో శ్రియ‌కి సైట్ కొట్టాను: మంచు విష్ణు

* ఫృద్వీగారూ… ఇంకోసారి న‌న్ను బ్ర‌ద‌ర్ అంటే బాగోదూ. మీకూ నాన్న‌గారికీ ఐదేళ్లే తేడా: విష్ణు

* రామజోగ‌య్య శాస్త్రిగారూ.. ఈమ‌ధ్య మీరు స‌రిగా రాయ‌డం లేదు. ఈపాట స‌రిగా రాయండి అని చెప్పా: విష్ఱు

* అన‌సూయ ఇంగ్లిష్ లో స్పీచ్ ఇస్తుంటే… `తెలుగులో మాట్లాడు` అంటూ ఆడియ‌న్స్ గోల పెట్టారు. `తెలుగులో అయితే మ‌నస్ఫూర్తిగా మాట్లాడ‌లేను` అంటూ అన‌సూయ ఇంగ్లిషులోనే స‌మాధానం ఇచ్చింది.

* మోహ‌న్ బాబుతో రెండు దెబ్బ‌లుతింటే బాగుండును అని సెట్లో అసిసెట్లంట్లంతా పోటీ ప‌డ‌తారు. ఎందుకంటే.. మోహ‌న్ బాబు కొట్టినా…ఆ త‌ర‌వాత డ‌బ్బులిచ్చి పంపిస్తాడ‌ని : బ్ర‌హ్మానందం

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close