సుభాష్ : పవన్‌కు షాకిచ్చిన శ్రీనుబాబు గేదెల చరిత్ర చాలా ఘనమైనదే..!

“శ్రీనుబాబు గేదేల”… ఈ పేరు చదవగానే మీకు టక్కున పవన్ కల్యాణ్ గుర్తుకు రావొచ్చు. తెలుగు నాట శ్రీనుబాబు గేదేల పవన్ ద్వారానే బయటకు తెలిసింది. ఆయనేదో ఉత్తరాంధ్రపై పరిశోధన చేశారని .. ఆ పత్రాలు ఏపీ ప్రభుత్వానికి ఇచ్చినా పట్టించుకోలేదని… కొన్నాళ్లు విమర్శలు చేశారు. అలాగే.. ఏపీ ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు భూమి ఇచ్చారు కానీ.. ఈ శ్రీనుబాబు గేదెలకు ఇవ్వలేదని… పవన్ విమర్శలు కూడా చేశారు. ప్రస్తుతం ఈ శ్రీనుబాబు గేదెలకు విశాఖపట్నం టిక్కెట్‌ను పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఇలా ఖరారు చేసిన నాలుగు రోజుల్లో.. ఆయన వెళ్లి జగన్‌తో వైసీపీ కండువా కప్పించుకున్నారు. ఇలా ఎందుకు చేశారా.. అని ఆరా తీసేలోపే.. ఆయన గురించి చాలా కథలు బయటకు వస్తున్నాయి.

ఈ శ్రీను బాబు గేదెల మామూలోడు కాదు..!

శ్రీనుబాబు గేదెల అనే వ్యక్తి.. సాఫ్ట్ వేర్ కంపెనీలు నడుపుతూ ఉంటారు. కానీ ఆ కంపెనీ సాఫ్ట్‌వేర్ పని చేయవు. పరిశోధనాత్మక ఆర్టికల్స్ పత్రికలకు అమ్ముతూ ఉంటాయి. కానీ పరిశోధన మాత్రం ఆ ఆర్టికల్స్‌లో ఉండదు. ఎలాంటి పరిశోధనల్లేకుండా… కనీస పరిశీలన లేకుండా.. ప్రముఖ పరిశోధకుల పేర్లు వాడుకుని… ఆరోగ్య , సామాజిక రంగంలో ఫేక్ రిపోర్టులను సృష్టిస్తూ అమ్ముకుని.. కేసుల పాలయిన వ్యక్తి ఈ శ్రీనుబాబు గేదెల. అమెరికాతో పాటు పలు దేశాల్లో ఆయనపై కేసులున్నాయి. శ్రీనుబాబు గేదేల ఆంధ్రా యూనివర్సిటీలో బీఫార్మసీ, బయోటెక్నాలజీలో ఎంటెక్ చేశారు. ఆ తర్వాత అమెరికా స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో పోస్ట్ -డాక్టోరల్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత అక్కడే అమెరికాలో నెవడాలో 2007 ఓమిక్స్ సంస్థను ప్రారంభించారు. 2009లో ఇండియాకు తిరిగి వచ్చారు. హైదరాబాద్‌లో ఓమిక్స్ ఆన్ లైన్ పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని ప్రారంభించారు. 2015లో దీన్ని ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు మార్చారు. రహేజా మైండ్ స్పేస్‌ భవనంలో… ఏడో అంతస్తులో ఈ ఆఫీసు ఉంటుంది. ఈ ఓమిక్స్ సంస్థ పని… పరిశోధన చేయడం, ఆర్టికల్స్ రాయడం.

ప్రముఖుల పేర్లతో ఫేక్ ఆర్టికల్స్‌తో దందా..!

ఓమిక్స్ పేరుతో.. ఆయన వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు పంపుతున్న ఆర్టికల్స్.. అమ్ముతున్న రీసెర్చ్ పత్రాలు.. అన్నీ ఫేక్ . సదస్సులు, సింపోజియన్స్, వర్క్ షాప్స్ లాంటివి ఏనీ నిర్వహించలేదు. కానీ ఆయా దేశాల్లోని ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లను కోట్ చేస్తూ పరిశోధన పత్రాలు మాత్రం రూపొందించారు. వాటిని ఆర్టికల్స్ గా చేసి.. అంతర్జాతీయ జర్నల్స్ కు అమ్ముకున్నారు. మొదట్లో నిజమేననుకున్న ఈ జర్నల్స్.. తర్వాత నిజం తెలుసుకుని ఆయా దేశాల్లోని అధికార వర్గాలకు ఫిర్యాదు చేశాయి. “అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్” నెవడా డిస్ట్రిక్ కోర్టులో కేసు పెట్టింది. మెడికల్, సైన్స్ రంగాల్లో … ఓమిక్స్ అమ్మిన ఆర్టికల్స్అన్నీ ఫేక్ అని… ఆయా ఆర్టికల్స్ లో ఉదహరించిన నిపుణులు అందరూ తమకుసంబంధం లేదని తేల్చినట్లుగా..అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్” ప్రాధమిక విచారణలో తేలింది. దీంతో.. ఈ ఓమిక్స్ ను ” ప్రిడేటరి పబ్లిషర్స్” జాబితాలో చేర్చింది. అంటే.. ఇక ప్రపంచంలోని ఏ జర్నల్ కూడా… ఈ ఓమిక్స్ ను నమ్మదు. ఆర్టికల్స్ ను తీసుకోదు. తన ఫేక్ ఆర్టికల్స్ అమ్ముడు పోవడానికి … దేశంలోని ప్రఖ్యాత పరిశోధకుల పేర్లు అసువుగా వాడేసుకుంటారు. దీనిపై వారంతా… ఆయా జర్నల్స్‌కు తమ అభిప్రాయాలు చెప్పారు కూడా. ఇదే కాదు.. ఈ సంస్థ ఫ్రీగా ఇచ్చే ఆర్టికల్స్ కూడా అత్యంత నాసికరంగా.. ఏ మాత్రం విషయం పరిజ్ఞానం లేని వాళ్లు రాసినట్లుగా ఉంటాయి. అందుకే వాటిని ఎవరూ తీసుకోరని… నిపుణులు చెబూంటారు.

ఫేక్ ఆర్టికల్స్ మాత్రమే కాదు బ్యాంకులకు టోకరా కూడా..!

ఈ శ్రీనుబాబు గేదెల పలు కంపెనీలు పెట్టారు. అందులో ఓమిక్స్ ఎంటర్ టెయిన్ మెంట్ , వెర్సాంట్ ఆన్ లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ , శ్రీనుసై బయోసాఫ్ట్ కంపెనీలు కూడా పెట్టారు. ఇందులో ఓమిక్స్ ఎంటర్ టెయిన్ మెంట్ పేరు మీద రూ. 5 కోట్లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నారు. వెర్సాంట్ ఆన్ లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద రూ. 4 కోట్ల 68 లక్షలు లాస్ చూపించారు. శ్రీనుసై బయోసాఫ్ట్ టర్నోవర్ కేవలం రూ. 16 లక్షలు. కంపెనీలో నిపుణులైన ఉద్యోగులు ఎవరూ ఉండరు. సైన్స్, మెడికల్ ఆర్టికల్స్ ను ప్రిపేర్ చేసేది ఓ ఇరవై రెండేళ్ల ఉద్యోగి. ఆమెకు ఏకంగా ఎడిటోరియల్ చీఫ్ పోస్ట్ ఇచ్చారు. ఆమెకి అంతా కలిపి ఏడాది అనుభవం ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే.. స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేస్తుంది. మనుస్క్రిప్ట్ చెక్ చేస్తుంది.

పక్కా ప్లాన్‌తోనే అంతర్జాతీయ మోసం..!

అంతర్జాతీయంగా కేసులు నమోదు అయినా.. ఫేక్ ఆర్టికల్స్ ప్రచురిస్తున్నా.. ఇండియాలోని సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోలేదనే ఆశ్చర్యం చాలా మంది నిపుణుల్లో ఉంది. ఎందుకంటే.. ఇండియాలో ఆయన తన ఆర్టికల్స్‌ను అమ్మడం లేదు. ఇండియా తమ మార్కెట్ కాదని ఆయన చెబుతున్నారు. ఈ ఏడాది మూడు వేల కాన్ఫరెన్స్‌లు పెట్టబోతున్నామని.. కానీ ఒక్కటి కూడా.. ఇండియాలో లేదని చెబుతున్నారు. ఇండియాకు సంబంధం లేనట్లుగా.. ఆయన తన కంపెనీని నిర్వహిస్తున్నందున… యూజీసీ లాంటి సంస్థలు చర్యలు తీసుకోలేకపోతున్నాయి. కానీ అమెరికాలోని నెవడా కోర్టు మాత్రం సీరియస్‌గా విచారణ చేస్తోంది.

పవన్ కల్యాణ్‌ను ఇంత కాలం మోసం చేశారన్న అభిప్రాయం జనసైనికుల్లో ఉంది. అయితే.. ఇలాంటి వారికి.. వైసీపీలో ప్రాధాన్యం లభిస్తుంది కాబట్టి.. ఆయన అక్కడకు చేరిపోయారంటున్నారు. మొత్తానికి జనసేన అభ్యర్థి నుంచి… శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి అవుతారేమో.. అన్న ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి.

ఈ ప్రిడేటర్ పబ్లిషర్ ” శ్రీనుబాబు గేదెలపై అంతర్జాతీయ పత్రికల్లో వచ్చిన న్యూస్ లింక్స్ ఇవీ చూడండి..!

https://www.bloomberg.com/news/features/2017-08-29/medical-journals-have-a-fake-news-problem

https://indianexpress.com/article/india/face-behind-biggest-of-all-40-countries-million-articles-fake-research-srinubabu-gedela-omics-5266830/

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close