వ‌ర్మ సినిమాకీ డ‌బ్బులిస్తారా??

రాంగోపాల్ వ‌ర్మ గొప్ప ద‌ర్శ‌కుడైతే కావొచ్చు. అది ఒక‌ప్పుడు. ఇప్పుడు మాత్రం ఆయ‌న‌న్నీ సిల్లీ సినిమాలే తీస్తున్నాడ‌ని ఆయ‌న హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా తెగ బాధ‌ప‌డిపోతుంటారు. యూ ట్యూబ్ కోస‌మే వ‌ర్మ సినిమాలు తీస్తున్నార‌ని వెట‌కారం చేసేవాళ్లూ ఉన్నారు. అందుకు త‌గ్గ‌ట్టే ఐస్ క్రీమ్ సినిమా యూ ట్యూబ్‌లో తెగ ఆడేస్తోంది. వ‌ర్మ సినిమాకి ఫ్యామిలీ ఆడియ‌న్స్ అస్స‌లు రారు. అందుకే వ‌ర్మ సినిమాల‌కు శాటిలైట్ అవ్వ‌దు. అయితే అదేంటో విచిత్రంగా వ‌ర్మ సినిమా శాటిలైట్ అమ్ముడుపోయింది.

ఆ సినిమానే అటాక్‌. మంచు మ‌నోజ్‌, ప్ర‌కాష్‌రాజ్‌, జేడీ చ‌క్ర‌వ‌ర్తి… త‌దితర తారాగ‌ణం న‌టించిన ఈ చిత్రం ఎప్పుడో పూర్త‌యిపోయింది. కానీ విడుద‌ల తేదీ విష‌యంలో మాత్రం మీన‌మేషాలు లెక్కేస్తోంది. బిజినెస్ కూడా మొద‌ల‌వ్వ‌లేదు. కానీ జెమినీ టీవీ శాటిలైట్ హ‌క్కుల్ని సొంతం చేసుకొంది. కోటి రూపాయ‌ల‌కు ఎటాక్ శాటిలైట్ అమ్ముడుపోయింద‌ని స‌మాచారం. వ‌ర్మ సినిమాకు కోటి అంటే ఎక్కువే మ‌రి. ఆ విధంగా ఎటాక్ రికార్డుల‌కెక్కిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close