కౌంటింగ్ కౌంట్ డౌన్ 5 : ప్రజాశ్రేయస్సు కాదు విద్వేషమే ప్రచార ఏజెండా..!

సార్వత్రిక ఎన్నికల సమరంలో.. ఓ ప్రధాన ఘట్టం ముగిసింది. ఏడో విడత ఎన్నికల ప్రచార గడువు ముగింపుతో… ఓ యుద్ధం ముగిసినట్లయింది. ఆదివారం 59 స్థానాల్లో .. జరగనున్న పోలింగ్‌తో… ఓటింగ్ ప్రక్రియ కూడా ముగుస్తుంది. రెండు నెలలకుపైగా సాగిన ఎన్నికల ఘట్టంలో… ఎన్నో పదనిసలు ఉన్నాయి. ప్రజాసమస్యలే చర్చకు రాని ఎన్నికల ప్రచారం ఈ సారి నడిచింది. దేశభవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికల్లో ప్రచారం మొత్తం విద్వేషపూరితంగా సాగింది.

అధికార పార్టీ ఎజెండా అంతా విద్వేష ప్రచారమే..!

ఎన్నికల సంఘం దేశంలోని మొత్తం 543 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అత్యంత సుదీర్ఘమైన షెడ్యూల్ ప్రకటించింది. రెండున్నర నెలల పాటు.. ప్రచారంతో హోరెత్తించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆషామాషీగా ఎన్నికలు పెట్టేసిన ఈసీ.. ఉత్తరాదిలో మాత్రం… ఎన్నికల ప్రక్రియను సాగదీసింది. చివరికి ఆ సుదీర్ఘ షెడ్యూల్ ముగింపునకు వచ్చింది. రెండున్నర నెలల ఎన్నికల ప్రక్రియలో… ఈసీ వ్యవహారం ఎంత వివాదాస్పదం అయిందో.. అధికార పార్టీ బీజేపీ ప్రచారం కూడా.. అంత కంటే.. ఎక్కువ ప్రజల్లో చర్చకు కారణం అయింది. అధికార పార్టీగా బీజేపీ.. ఐదేళ్లలో చేసిన ఒక్కటంటే… ఒక్క పనినీ చెప్పుకుని ఓట్లు అడగకపోవడం.. ఈ ఎన్నికల్లో హైలెట్. ఎవరైనా.. తమ ఐదేళ్ల పనితీరును ప్రజల ముందు పెట్టి ఓట్లు అడుగుతారు. కానీ బీజేపీ, మోదీ మాత్రం… భిన్నమైన ప్రచార మార్గాన్ని ఎంచుకున్నారు. విడతలవారీగా.. ప్రచార సరళిని మార్చుకున్నారు. ఓ సారి పాకిస్థాన్ పై దుమ్మెత్తి పోస్తారు.. మరో సారి కశ్మీర్ ను కంఠంలో ప్రాణంలో ఉండగా కశ్మీర్ ను విడదీయలేరంటారు.. మరోసారి కాంగ్రెస్ గెలవాలని పాకిస్తాన్ కోరుకుంటుందంటారు. చివరికి పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన సైనికులను కూడా.. చూపించి.. బీజేపీకి ఓటు వేసి.. వారికి నివాళులర్పించాలన్న ప్రకటన కూడా.. మోదీ, షా చేశారు. దీన్ని బట్టి చూస్తేనే… చివరికి సైనికుల శవాలను కూడా బీజేపీ వదిలి పెట్టలేదని అర్థం చేసుకోవచ్చు. ఇక దేశంలో… ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా.. మెజార్టీ, మైనార్టీ అంటూ సాక్షాత్తూ ప్రధానమంత్రి ప్రచారం చేయడం… తన కులాన్ని అడ్డు పెట్టుకుని ఓట్లు అడగడం.. లాంటివి.. ఈ ఎన్నికల్లోనే కనిపించిన విశేషాలు. చివరి విడతకు ముందు బీజేపీ నేతలు.. గాంధీ మహాత్ముడిని హత్యచేసిన…గాడ్సేను.. దేశభక్తునిగా పొగడటం… ఫినిషింగ్ టచ్ లాంటిది. ప్రజ్ఞాసింగ్.. ఈ ట్రెండ్ ప్రారంభించగా.. పలువురు బీజేపీ నేతలు… అదే రాగం అందుకున్నారు. బీజేపీ వారిని కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు. కానీ మోదీ మాత్రం… అలా అన్నవారిని క్షమించబోనని.. ఓ ప్రకటన చేసి.. సర్దుకున్నారు. ఎక్కడా… ఐదళ్లలో తాము ప్రజల బతుకుల్ని ఇలా బాగు చేశామని చెప్పలేదు. ఐదేళ్ల కిందట.. ఇచ్చిన హామీల్లో..ఫలానా వాటిని నెరవేర్చామని చెప్పుకోలేదు. అంటే.. అధికార పార్టీ అయిన… బీజేపీ ప్రచారం… పాకిస్థాన్‌ను బూచిగా చూపడంతో ప్రారంభమయి.. దేశభక్తికి కొత్త అర్థం చెబుతూ.. గాడ్సేను జాతిరత్నంగా చెప్పడంతో ముగిసింది.

“న్యాయ్‌” పరంగా రాహుల్ పోరాటం..!

కాంగ్రెస్ పార్టీ ప్రచార భారాన్ని ఈ సారి రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక కూడా.. తీసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న సోనియా గాంధీ.. ఈ సారి ఒక్క ప్రచారసభలో కూడా పాల్గొనలేదు. కానీ ఆమె ఎన్నికల బరిలో మాత్రం నిలబడ్డారు. రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ… దేశవ్యాప్తంగా చురుగ్గా ప్రచారం చేశారు. గతంలో కంటే భిన్నంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ సారి న్యాయ్ అనే పథకంపై ఎక్కువగా ఆధారపడింది. ఉత్తరాది ప్రజల్లోకి.. ఈ పథకాన్ని తీసుకెళ్లేందుకు.. ఎక్కువగా ప్రయత్నించారు. బీజేపీ అగ్రనేతలు.. వివాదాస్పద అంశాలు, మత, సైన్యం పేరుతో రాజకీయాలు చేసినప్పటికీ… రాహుల్ గాంధీ మాత్రం ఎక్కువ విధానపరమైన అంశాలు… మోదీ వైఫల్యాలు… తాము వస్తే ఏంచేస్తామో.. చెప్పేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ప్రజల్లోకి వెళ్లినప్పటికీ.. నెగెటివ్ అంశాలకే ఎక్కువ ప్రచారం లభిస్తుంది కాబట్టి.. ఈ విషయంలో.. మోదీ, షాలే ఎక్కువగా హైలెట్ అయ్యారు. ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్ పార్టీ తరపున చురుకుగా ప్రచారం చేశారు. అనుభవజ్ఞురాలైన నాయకురాలిగా.. హుందాగా ఆమె ప్రచారం సాగింది. మోదీ, షాలపై..సూటిగా విమర్శలు గుప్పించారు. ఇందిరాగాంధీ పోలికలతో.. ఆకట్టుకోవడంతో.. ఆమె ప్రచారం …కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిందనే అభిప్రాయం ఉంది.

విస్తృతి పెంచుకున్న ప్రాంతీయ పార్టీలు..!

ఈ సారి ఎన్నికల ప్రచారంలో మరో విశేషం.. ప్రాంతీయ పార్టీల నేతలు.. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేయడం. ఏపీలో ప్రచారం చేయడానికి… మమతా బెనర్జీ, దేవేగౌడ, ఫరూక్ అబ్దుల్లా వచ్చారు. చంద్రబాబు కూడా.. వారి కోసం ప్రచారానికి వెళ్లారు. తమిళనాడు, కర్ణాటక, బెంగాల్‌లో…చంద్రబాబు ఆయా పార్టీల కోసం ప్రచారం చేశారు. ఈ సారి ఎన్నికల్లో.. ప్రాంతీయ పార్టీలు.. ఈ విధంగా..తమ ఉనికిని జాతీయ స్థాయిలో చాటుకునే ప్రయత్నాలు జరిగాయి. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీకే కీలకంగా ఉంటాయనే విశ్లేషణలు వస్తున్న తరుణంగా..ప్రాంతీయ పార్టీల నేతలు.. తమ పరిధిని.. జాతీయ స్థాయికి విస్తృత పరుచుకోవడానికి.. ఈ సారి రాజకీయ పరిస్థితులు ఉపకరించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close