శంక‌ర్ టైటిల్‌తో.. నాని సినిమా

శంక‌ర్ – అర్జున్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జెంటిల్‌మెన్ సినిమా గుర్తుంది క‌దా? ఆ టైటిల్‌ని ఇప్పుడు నాని వాడేస్తున్నాడు. నాని – ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ క‌ల‌యిక‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకి టైటిల్ ఈరోజు కొద్ది సేప‌టి క్రితం ఫిక్స్ చేశారు. ఆ టైటిల్‌.. జెంటిల్‌మెన్‌. ఇదో థ్రిల్ల‌ర్ సినిమా. అందులో ల‌వ్ స్టోరీని మిక్స్ చేశారు. క‌థానుసార‌మే జెంటిల్‌మెన్ అనే టైటిల్‌పెట్టార‌ట‌. ఈరోజు పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. పోస్ట‌ర్ చూస్తుంటే ఇంద్ర‌గంటి ఈసారి నిజంగానే కొత్త క‌థ ఎంచుకొన్నాడ‌నిపిస్తోంది. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జాగుతున్నాయి. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈచిత్రంలోని గీతాల్ని త్వ‌ర‌లో విడుదల చేస్తారు.

అన్న‌ట్టు ఇంద్ర‌గంటి మొన్నామ‌ధ్య అల్ల‌రి న‌రేష్ తో బంధిపోటు సినిమా తీశాడు. అది కాస్త త‌ల‌పోటు సినిమాగా మారింది. ఇంద్ర‌గంటి ఫామ్‌లోకి రావాలంటే.. జెంటిల్‌మెన్‌తో హిట్టు కొట్టాల్సిందే. పైగా నాని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో అష్టాచ‌మ్మా సినిమా వ‌చ్చింది. సో.. హిట్ కాంబినేష‌న్లో మ‌రోసారి హిట్టొస్తుంద‌ని ఆశిద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close