వెండితెర‌పై… గ్లామ‌ర్ దెయ్యాల గోల‌

ఇది వ‌ర‌కు దెయ్యం సినిమా అంటే ఫ‌క్తు సీ గ్రేడ్ మూవీనే. తెర‌పై క‌నిపించే న‌టీన‌టుల పేర్లు కూడాఅంతగా తెలిసేవి కావు. ఎటు చూసినా కొత్త‌వాళ్లే. ఏదో కాసేపు స‌ర‌దాగా భ‌య‌పడ‌దాం అనుకొనేవాళ్లే ఆ టైపు సినిమాల‌కు వెళ్లేవారు. రాన్రానూ.. దెయ్యం సినిమాల‌కూ స్టార్ హోదా ద‌క్కింది. రాంగోపాల్ వ‌ర్మ‌లాంటి ద‌ర్శ‌కులు ఎప్పుడైతే ఇలాంటి క‌థ‌ల‌పై మోజు పెంచుకొన్నారో.. హార‌ర్ సినిమాలో స్టార్‌ల హ‌వా పెరిగింది. మ‌ధ్య‌లో కాస్త చ‌ల్లారిన హార‌ర్ గోల‌.. ఈ మ‌ధ్య కామెడీ హార‌ర్ అంటూ వెర్రిత‌ల‌లుల వేస్తోంది.

స్వాతి, అంజ‌లి, నందిత లాంటి ద్వితీయ శ్రేణి హీరోయిన్లు హార‌ర్ కామెడీ క‌థ‌ల‌కు ప‌క్క‌గా సెట్ట‌యిపోయారు. అలాంటి సినిమాల‌కు ఆద‌ర‌ణ కూడా బాగానే ల‌భిస్తోంది. త‌క్కువ బ‌డ్జెట్‌తో తీసి ఎక్కువ సంపాదించుకోవ‌చ్చ‌న్న న‌మ్మ‌కం నిర్మాత‌ల్లో పెరిగింది. దాంతో.. బ‌డా హీరోయిన్లూ ఈ టైపు క‌థ‌ల‌పై దృష్టి పెట్టారు. హ‌న్సిక‌, న‌య‌న‌తార ఆల్రెడీ ప్రేక్ష‌కుల్ని భ‌య‌పెట్టేశారు. త్రిష కూడా నాయ‌కిలో భ‌య‌పెట్ట‌డానికి రెడీ అయ్యింద‌ట‌. కాంచ‌న‌లో తాప్సి ప్రేక్ష‌కులకు చ‌మ‌ట‌లు ప‌ట్టించింది. లేటెస్టుగా రెజీనా కూడా ఓ త‌మిళ సినిమాలో దెయ్యం క్యారెక్ట‌ర్ వేస్తోందట‌. ఇప్పుడు మిల్కీ బ్యూటీ త‌మన్నా కూడా దెయ్యం క‌థ‌ల‌పై మ‌క్కువ పెంచుకొంది. విజ‌య్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న అభినేత్రిలో త‌మ‌న్నాది దెయ్యం పాత్రేన‌ట‌. ఇలా.. తెలుగు, త‌మిళ క‌థానాయిక‌లు, గ్లామ‌ర్‌నే న‌మ్ముకొని అంద‌లాలు ఎక్కిన తార‌లు ఇప్పుడు దెయ్యాలుగా మారుతున్నారు. అలా.. హార‌ర్ సినిమాలోనూ కావ‌ల్సినంత గ్లామ‌ర్ యాడ్ అవుతోంది. మ‌రి.. ఈ పోక‌డ ఎంత కాల‌మో చూడాలి. ఒక‌ట్రెండు సినిమాలు ప‌ల్టీలు కొడితే.. మ‌ళ్లీ అంతా మామూలే. అందాక ఈ గ్లామ‌ర్ దెయ్యాల‌ను తెర‌పై మ‌న‌మూ భ‌రించాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close