కాంగ్రెస్‌కు.. గో.. గోవా.. గాన్..!

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసలేమీ బాగోలేదు. ఏ రాష్ట్రంలోనూ.. ఆ పార్టీకి సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. అయితే.. ఆ పార్టీని ప్రత్యక్షంగా.. బీజేపీ నిర్వీర్యం చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలే.. ఆ “పుణ్యాన్ని” మూటగట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా.. కాంగ్రెస్ పార్టీ నేతలుగా చెలామణి అయి.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు.. భారతీయ జనతా పార్టీ.. పిలిచినా.. పిలవకపోయినా.. పోయి ఆ పార్టీలో చేరేందుకు పరుగులు పెడుతున్నారు. తెలంగాణతో ప్రారంభమయింది. ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా పోయింది. ఇప్పుడు.. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అన్న హోదాను కూడా.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తీసేస్తున్నారు. తమకు మంత్రి పదవులో.. మరో ప్రయోజనం కోసమో.. తమ పార్టీకి టెండర్ పెట్టేశారు.

కర్ణాటక ఎపిసోడ్ సాగుతూండగానే.. గోవా కాంగ్రెస్ నాయకులు.. తమ ప్రతాపం చూపించడం ప్రారంభించారు. గోవాలో కాంగ్రెస్‌కు మొత్తం 15 మంది ఎమ్మెల్యేలుండగా, బుధవారం 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. మూడింట రెండొంతుల మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దాంతో.. కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం అయినట్లుగా.. స్పీకర్ ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రకాంత్‌ కవ్లేకర్‌ కూడా బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు.

గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలున్నాయి. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. పదిహేడు సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీకి వచ్చింది పదమూడు సీట్లే. అయితే.. గోవా ఫార్వర్డ్‌ , మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ, ఎన్సీపీలతో పాటు మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి మద్దతు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెందిన ఇద్దర్నీ తన.. కాంగ్రెస్ నుంచి మరో ఇద్దర్నీ బీజేపీలో చేర్చుకుంది. మొత్తానికి పదిహేడు సీట్లకు చేరింది. అయినా ఇతర పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోంది. ఈ క్రమంలో… ఏకంగా కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేస్తూ… పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. దీంతో బీజేపీ బలం 27కి పెరిగింది. గోవాలో కాంగ్రెస్ నిర్వీర్యం అయిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close