“సినీ దిగ్గ‌జం శ్రీ ఎస్ఎస్ రాజ‌మౌళికి గోదావ‌రి బోస్ట‌న్ ఆత్మీయ ఘ‌న‌స్వాగ‌తం పలుకుతోంది”

ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇండియన్ రెస్టారెంట్ చైన్ ‘గోదావ‌రి’ భార‌తీయ సినీ దిగ్గ‌జం శ్రీ ఎస్.ఎస్ రాజ‌మౌళి గారికి త‌న మాతృకేంద్ర‌మైన‌ బోస్ట‌న్‌లో గోదావ‌రి (#Godavari) ఆత్మీయ స్వాగ‌తం ప‌లికింది.

హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఇండియా కాన్ఫ‌రెన్స్-2019కు హాజ‌రు కావాల్సిందిగా అందిన ఆహ్వానం మేర‌కు శ్రీ ఎస్‌.ఎస్ రాజ‌మౌళి గారు విచ్చేశారు. గ‌తంలో ఈ ప్ర‌తిష్టాత్మ‌క స‌దస్సుకు భార‌త‌దేశానికి చెందిన ప్ర‌ముఖులు శ్రీ క‌మ‌ల్ హాస‌న్‌, శ్రీ‌ షారుక్ ఖాన్‌, శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా మ‌రెంద‌రో ప్ర‌ముఖులు విచ్చేశారు.

బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అయిన ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్.ఎస్ రాజ‌మౌళిని బోస్ట‌న్‌కు ఆహ్వానించ‌డాన్ని త‌మ‌కు ద‌క్కిన గ‌ర్వ‌కార‌ణ‌మైన అంశంగా గోదావ‌రి భావిస్తోంది. బోస్ట‌న్‌లో ఆవిర్భ‌వించిన గోదావ‌రి వినియోగ‌దారుల ఆద‌రాభిమానాలు పొందుతూ విశ్వ‌వ్యాప్తంగా త‌న ఆతిథ్యాన్ని అందిస్తోంది.

“భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌ను స‌త్తాను చాటుతూ మ‌న సినీ ఖ్యాతిని అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల స‌ర‌స‌న చేర్చిన ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హిత, విశ్వ‌విఖ్యాత ప్ర‌ముఖుడు శ్రీ ఎస్.ఎస్ రాజ‌మౌళిని ‘గోదావ‌రి’ ఏర్ప‌డిన బోస్ట‌న్‌కు ఆహ్వానించ‌డం మాకెంతో సంతోషాన్ని క‌లిగిస్తోంది.

బాహుబ‌లి మొద‌టి పార్ట్ విడుద‌ల స‌మ‌యంలోనే బోస్ట‌న్‌లో మా తొలి ఆతిథ్య కేంద్రాన్ని ప్రారంభించాం. బాహుబ‌లి ఎలాగైతే వీక్ష‌కుల ఆద‌రాభిమానాలు పొందుతూ విశ్వ‌వ్యాప్త ఖ్యాతిని సొంతం చేసుకోవడంతో పాటుగా ప్ర‌పంచ సినీ జ‌గ‌త్తులో ప్ర‌త్యేక‌ చ‌రిత్ర‌ను సృష్టించి త‌న‌కంటూ విశిష్ట స్థానాన్ని కైవ‌సం చేసుకుందో….అదే రీతిలో, గోదావ‌రి సైతం ప్ర‌పంచ ఆతిథ్య ప‌రిశ్ర‌మ‌లో త‌న ప్రామాణిక‌మైన రుచుల‌తో (authentic Indian food) వినియోగ‌దారుల ఆద‌రాభిమానాలు పొందుతూ విశిష్ట ముద్ర‌ను పొందుతోంది” అని ‘టీం గోదావ‌రి’ వెల్ల‌డించింది.

“శ్రీ ఎస్‌.ఎస్ రాజ‌మౌళి గారు మా యంగ్‌టీం స్ఫూర్తి ప్ర‌దాత‌. బాహుబ‌లి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం వెనుక ఆయ‌న దూర‌దృష్టి మరియు క‌ఠోర శ్ర‌మను మేం వీక్షించాం. ఈ మొత్తం ప్ర‌క్రియ‌ను మేం కేస్ స్ట‌డీగా భావిస్తున్నాం. విద్యార్థులు మ‌రియు మాలాంటి యంగ్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించాల‌ని హార్వ‌ర్డ్ కోర‌డాన్ని మేం గౌర‌వంగా భావిస్తున్నాం” అని ‘టీం’ గోదావ‌రి స్ప‌ష్టం చేసింది.

మినియాపోలిస్‌, నాప‌ర్‌విల్లే, టాంప‌, టోరంటో (కెనడా), ఆమ్‌స్ట‌ర్‌డ‌మ్ (యూర‌ప్‌)ల్లో రాబోయే కొన్ని మాసాల్లో త‌న నూత‌న కేంద్రాల‌ను ఓపెన్ చేసేందుకు “గోదావ‌రి” (Best Indian Restaurant in USA) స‌ర్వ‌స‌న్న‌ద్ధం అయింది.

మా బృందంలో చేరేందుకు మ‌రియు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్క‌డైనా రెస్టారెంట్ ప్రారంభించేందుకు మాతో క‌లిసి ముందుకు సాగేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లైతే franchise@godavarius.com ద్వారా మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించండి.

శ్రీ ఎస్.ఎస్ ‘బాహు’మౌళి మ‌రియు జ‌క్క‌న్న‌గా అభిమానులు పిలుచుకునే శ్రీ ఎస్‌.ఎస్ రాజ‌మౌళిగారు బోస్ట‌న్‌లో త‌న ప‌ర్య‌ట‌న సంతోష‌క‌రంగా మ‌రియు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా మేం మ‌న‌స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం.

గోదావ‌రి ఫుడ్ ఫ్యాక్ట‌రి

బోస్ట‌న్ నుంచి ప్ర‌పంచ‌మంతా విస్త‌రిస్తున్న రెస్టారెంట్‌

www.GodavariUS.com

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com