టెర్రర్ గోపిచంద్ తీసుంటే..!

కొన్ని సినిమాలు కొంతమంది హీరోల చేతి నుండి మిస్ అయ్యి వేరే హీరో దగ్గరకు వెళ్లడం జరుగుతుంది. అయితే మిస్ అయిన సినిమాలు అపజయం పొందితే హమ్మయ్య సినిమా వదిలేసి మంచి పనిచేశాం అనుకునే హీరోలు, ఒకవేళ మిస్ అయిన సినిమా హిట్ అయితే మాత్రం అర్రె మంచి సినిమా వదిలేశామే అనుకునే అవకాశం ఉంది. ఇలా చాలా సందర్భల్లో చాలా హీరోలకు జరిగింది కూడా.

తాజాగా ఇలాంటి సందర్భం ఓ హిట్ కోసం తపిస్తున్న హీరోకి ఎదురైంది. కొద్దికాలంగా హిట్ కోసం తపిస్తున్న మ్యాన్లీ స్టార్ గోపిచంద్ లౌఖ్యం లాంటి హిట్ కొడదామని వచ్చిన సౌఖ్యం కాస్త ఫ్లాప్ అవ్వడంతో తీసే సినిమాల మీద మరింత జాగ్రత్తపడుతున్నాడు. అయితే ఇటీవల సీనియర్ హీరో శ్రీకాంత్ నటించిన టెర్రర్ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. సినిమా నిర్మాతలకు సినిమా మంచి లాభాలనే తెచ్చిపెట్టిందని టాక్.

అయితే ఆ సినిమా కథ ముందు దర్శకుడు సతీశ్ హీరో గోపిచంద్ కు వినిపించాడట. సినిమా మొత్తం సీరియస్ గా ఉండటం వల్ల ప్రేక్షకులకు ఎక్కుతుందో లేదో అని ఆ సినిమాను కాదనేశాడట గోపిచంద్. అసలు ఫాంలో లేని శ్రీకాంత్ చేత తీసి వారెవా అనిపించుకున్న సతీశ్ ఒకవేళ అదే సినిమా గోపిచంద్ తో తీసుంటే కచ్చితంగా హిట్ కొట్టే అవకాశం ఉండేది.. ఇక గోపిచంద్ చేసుంటే అతని మార్కెట్ ప్రకారం సినిమా ఇంకా పెద్ద సక్సెస్ అయ్యి ఉండేది. సో గోపిచంద్ ఓ ఛాన్స్ మిస్ అయ్యాడన్నమాట అది మ్యాటర్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close