‘పంతం’ ట్రైల‌ర్‌: మ‌రో రొటీన్ రాబిన్‌హుడ్ క‌థేనా?

ఉన్నోడ్ని కొట్టి – లేనోడికి పెట్ట‌డం రాబిన్‌హుడ్ సిద్దాంతం. ఈ నేప‌థ్యంలో తెలుగులో చాలా క‌థ‌లొచ్చాయి. కొండ‌వీటి దొంగ నుంచి మొన్నోచ్చిన కిక్ వ‌ర‌కూ కొన్ని హిట్ చిత్రాల‌కు ఈ క‌థ‌లు ప్రాణం పోశాయి. ‘పంతం’ కూడా ఈ జాబితాలోకి చేర‌బోతోంద‌నిపిస్తోంది. గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 25వ చిత్ర‌మిది. మెహ‌రిన్ క‌థానాయిక‌. చ‌క్రి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ట్రైల‌ర్ విడుద‌లైంది. ”కురు క్షేత్రం యుగానికి ఒక్క‌సారే జ‌రుగుతుంది. ధ‌ర్మం వైపు నిల‌బ‌డాలో, అధ‌ర్మం వైపు నిల‌బ‌డాలో నిర్ణ‌యం అప్పుడే తీసుకోవాలి” అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. క‌ట్ చేసిన షాట్లు, డైలాగులు చూస్తుంటే.. ఇది ధ‌న‌వంతుల్ని కొట్టి, పేద‌ల‌కు పంచే రాబిన్‌హుడ్ టైపు స్టోరీ అని అర్థ‌మైపోతోంది. న్యాయ వ్య‌వ‌స్థ‌నీ, అందులోని లోపాల్నీ, రాజ‌కీయ నాయ‌కులు చేసే స్కాముల్ని, ప్ర‌జ‌ల త‌ప్పుల్ని వేలెత్తి చూపించే సినిమాగా `పంతం` ఉండ‌బోతోంద‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది. గోపీ క్యారెక్ట‌ర్‌కి రెండు షేడ్లు ఉన్నాయ‌ని గెట‌ప్పులు చూస్త తెలిసిపోతోంది. సినిమా ల‌వ్ ట్రాక్‌తో మొద‌లై.. మెల్ల‌మెల్ల‌గా సీరియ‌స్ ఇష్యూల‌వైపు టర్న్ తీసుకుంటూ, ఆశ్ర‌మాన్ని కాపాడ‌డం కోసం గోపీచంద్ దొంగ‌త‌నాల‌వైపు మొగ్గు చూపించ‌డం – ఇదీ ఈ సినిమా కాన్సెప్టు.

దాన్ని న‌వ‌ర‌స‌భ‌రితంగా ఎలా తీశాడో తెలియాలంటే జులై 5 వ‌ర‌కూ ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.