అది బెల్లంకొండ ‘నో’ చెప్పిన క‌థే!

గోపీచంద్ – సంప‌త్‌నంది కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఇటీవ‌లే క్లాప్ కొట్టుకుంది. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాకు ‘సిటీమార్‌’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. అయితే.. ఈ క‌థ ఇది వ‌ర‌కే బెల్లంకొండ శ్రీ‌నివాస్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ట్టు స‌మాచారం. బెల్లంకొండ – సంప‌త్‌నంది మ‌ధ్య రెండు మూడు సిట్టింగులు కూడా జ‌రిగాయ‌ట‌. అయితే.. బెల్లంకొండ కి ఈ క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ‘నో’ చెప్పాడ‌ట‌. అదే క‌థ‌ని గోపీచంద్‌కి చెప్పి ఓకే చేయించుకున్నాడు సంప‌త్‌నంది.

గోపీచంద్ – సంప‌త్‌నందిల కాంబోలో ఇది వ‌ర‌కు `గౌత‌మ్ నంద‌` సినిమా వ‌చ్చింది. అది ఫ్లాప్‌. అయినా స‌రే… సంప‌త్‌ని న‌మ్మి ఈ క‌థ‌ని ఓకే చేశాడు గోపీచంద్‌. అస‌లే గోపీ వ‌రుస ఫ్లాపుల‌లో ఉన్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన `చాణ‌క్య‌` కూడా డిజాస్ట‌ర్ లిస్టులో చేరింది. ద‌స‌రా సీజ‌న్‌లో కూడా ఈ సినిమాకి క‌నీస వ‌సూళ్లు రాలేదంటే – ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి ద‌శ‌లో ఓ ఫ్లాప్ కాంబినేష‌న్‌ని రిపీట్ చేయ‌డ‌మే పెద్ద రిస్కు. అందులోనూ ఓ హీరో రిజ‌క్ట్ చేసిన క‌థ‌ని ఒప్పుకోవ‌డం మ‌రింత పెద్ద రిస్కు. ఇన్ని ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని ఎదుర్కుని వ‌స్తున్న `సిటీమార్‌` ఎలా ఉంటుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close