గోపీచందూ… ప్రేమకథ అంటే ప్రయోగమే!

ప్రేమకథలు చేయాల్సిన వయసులో ‘యజ్ఞం’, ‘రణం’ వంటి యాక్షన్ కథలు చేశారు హీరో గోపీచంద్. అంతకు ముందు ‘జయం’, ‘నిజం’ సినిమాల్లో ప్రతినాయకుడిగా క్రూరత్వం చూపించారు. విల‌న్‌గా, హీరోగా తొలినాళ్లలో చేసిన సినిమాలతో యాక్షన్ ఇమేజ్ వచ్చేయడంతో తరవాత కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ చేశారు. ఇప్పటివరకూ ఆయన పూర్తిస్థాయి ప్రేమకథ చేయలేదు. త్వరలో చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో కొత్త దర్శకుణ్ణీ పరిచయం చేయబోతున్నారు. బీవీఎస్ఎన్‌ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ “నేను ఇప్పటివరకూ ప్రేమకథలో నటించలేదు. నా దగ్గరకు వచ్చిన కథల్లో నచ్చినవి చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు నేను ప్రేమకథలో నటించాలంటే… ఆ కథ నాకు తగ్గట్టుగా వుండాలి. కుమార్‌ అని ఓ కొత్త దర్శకుడు ఒక మంచి ప్రేమకథతో నా దగ్గరకు వచ్చాడు. అందులో నటించడానికి ఒప్పుకొన్నా. పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రమిది” అన్నారు. ఇప్పుడు గోపీచంద్ వయసు దగ్గరదగ్గరగా 40 ఏళ్ళు. ఈ వయసులో ఆయనో ప్రేమకథలో నటించాలంటే ఆయనకు తగ్గట్టు వుండాలి. ఈ వయసులో ఆయనో ప్రేమకథ చేయడం అంటే ప్రయోగమే. నటుడిగా గోపీచంద్ 25వ సినిమా ‘పంతం’ గురువారం విడుదల అవుతోంది. దీని తరవాత ప్రేమకథ చేస్తారా? మధ్యలో సంపత్ నంది సినిమా చేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే… సంపత్ నందికి, ఆయనకు మధ్య చర్చలు జరుగుతున్నాయని టాక్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close