మరో వినసొంపైన టైటిల్ తో గోపీచంద్

సినిమా హీరోలకు సెంటిమెంట్ అనేది ఒకసారి ఏర్పడ్డదంటే ఇక దాన్ని అలానే కొనాసాగిస్తుంటారు. గోపీచంద్ కూడా తనకు మొదటి హిట్ సినిమా యజ్ఞం దగ్గరనుండి హిట్ వచ్చినా రాకున్నా ఆ రెండక్షరాల టైటిల్ సెంటిమెంట్ ని మాత్రం మార్చలేకపోతున్నాడు. తాను విలన్ గా నటించిన సినిమాలు వర్షం, నిజం సినిమాలు కూడా రెండక్షరాల టైటిల్స్ కావడం అవి కాస్త సూపర్ హిట్ కావడంతో ఇక ఆ సెంటిమెంట్ ని బలపరిచాడు గోపీచంద్. ఆ దారిలోనే అతని సినిమాలు లక్ష్యం, శౌర్యం, శంఖం, లౌఖ్యం వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన గోపీచంద్ స్టైలిష్ యాక్షన్ మూవీ జిల్ కూడా రెండక్షరాల టైటిలే.

అయితే ఇదే సెంటిమెంట్ కి కొనసాగింపుగా మరోసారి తన సినిమా టైటిల్ రెండక్షరాలతో పెట్టాడు గోపీచంద్. ప్రస్తుతం రవికుమార్ చౌదరీ దర్శకత్వంలో గోపీచంద్ తీస్తున్న సినిమాకు ‘సౌఖ్యం’ అనే టైటిల్ పెట్టారని ఫిల్మ్ నగర్ టాక్. కేవలం రెడక్షరాల టైటిలే కాదు సినిమా టైటిల్ తో కథ కథనాలను కూడా తెలిసేట్టుగా చేస్తున్నాడు గోపీచంద్. రెజినా జంటగా నటిస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్లో భవ్య ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

పిల్లా నువ్వు లేని జీవితంతో మాంచి హిట్ కొట్టిన ఈ దర్శకుడు గోపీచంద్ కి కూడా సౌఖ్యంతో హిట్ ఇస్తాడనే నమ్ముతున్నారు గోపీ అభిమానులు. లౌఖ్యం గా హిట్ కొట్టి సౌఖ్యంగా వస్తున్నా గోపీచంద్ ఈ సినిమాతో మరో అద్భుతమైన సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close