గోపీచంద్‌ హీరోగా ప్రారంభమైన భారీ చిత్రం ‘ఆక్సిజన్‌’

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్న ‘ఆక్సిజన్‌’ చిత్రం షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో ఈరోజు చెన్నయ్‌లోని శ్రీవిశ్వరూపా సాయిబాబా టెంపుల్‌లో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో హీరో గోపీచంద్‌, డైరెక్టర్‌ జోతికృష్ణ, నిర్మాణ పర్యవేక్షకులు ఎ.ఎం.రత్నం, నిర్మాత ఎస్‌.ఐశ్వర్య, సినిమాటోగ్రాఫర్‌ వెట్రి పాల్గొన్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు జోతికృష్ణ తెలియజేస్తూ – ”ఇది ఒక ఫాస్ట్‌ పేస్డ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈరోజు పూజా కార్యక్రమాలతో మా ‘ఆక్సిజన్‌’ చిత్రాన్ని ప్రారంభించాము. ఈ చిత్రంలో జగపతిబాబుగారు ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. జనవరి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది” అన్నారు.

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌, జగపతిబాబు, కిక్‌ శ్యామ్‌, రాశిఖన్నా, అను ఇమ్మానుయేల్‌, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌: సిల్వ, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాణ పర్యవేక్షణ: ఎ.ఎం.రత్నం, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close