500 మందికేనా ? రూల్స్ మార్చేయండి .. ఇచ్చేద్దాం !

ఏపీ ప్రభుత్వానికి “అర్హులు” అనే వాళ్లు చాలా ముద్దు. ఏ పథకంలో అయినా అర్హులు అనే కాన్సెప్ట్‌ను అధికంగా వాడుతూ ఉంటుంది. అయితే ఈ అర్హులు ప్రతీ సారి తగ్గేలా చూసుకుంటూ ఉంటారు. కానీ ఓ పథకంలో మాత్రం ఇలాంటి అర్హులను తేల్చడానికి పెట్టిన కండిషన్లను సంతృప్తి పరిస్తే.. మిగిలిన లబ్దిదారులు కేవలం ఐదు వందల మంది. దీంతో ప్రభుత్వానికి కూడా కాస్త సిగ్గనిపించింది. వెంటనే రూల్స్ మార్చాలని మరింత మందికి పథకం వర్తింప చేద్దామని ఆదేశించింది.

వైఎస్ జగన్ ప్రభుత్వం పాస్టర్లకు నెలకు రూ. ఐదు వేలు జీతంలాగా ఇవ్వాలని డిసైడయింది. ఇందు కోసంగతంలో దరఖాస్తులు స్వీకరించారు. వాలంటీర్లుకూడా వెరిఫికేషన్ చేశారు. దాదాపుగా పదహారు వేల మందికిపైగా చర్చి పాస్టర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరందర్నీ అర్హులుగా గుర్తించి గతంలో కరోనా సాయం కూడా ఏపీ ప్రభుత్వం చేసింది. కానీ ఇప్పుడు వారెవరూ .. నెలకు రూ. ఐదు వేలు పొందడానిక అర్హులు కారని.. కేవలం ఐదు వందల మంది మాత్రమే అర్హులని తేల్చింది. ఎందుకంటే.. ప్రభుత్వం పెట్టిన మూడు నిబంధనల ప్రమాణాలు వీరిలో ఐదు వందల మంది మాత్రమే అందుకున్నారు.

అయితే మరీ ఇంత తక్కువగా ఐదు వందల మందికి ఎలా పథకం అమలు చేస్తామని.. హాఫ్ పేజీ కాదు కదా అందులో సగం పేజీ యాడ్ ఇచ్చేంత బలం కూడా పథకానికి ఉండదని ప్రభుత్వం భావించి.. నిబంధనలు సడలించాలని నిర్ణయించింది. మరింత మరింత మంది అర్హులు పథకంలోకి వచ్చేా అర్హతల్ని మార్చాలని భావించి ఆదేశాలు జారీ చేసింది. మూడు షరతుల్లో ఓ షరతును తొలగించి ఐదారు వేల మందికైనా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మామూలుగా అయితే ఆలోచించేవారు కాదేమోకానీ.. ఇక్కడ రెండున్నరేళ్లయిపోయింది..ఇంకా మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పాస్టర్లకు ఇస్తామన్నది ఇవ్వలేదు కాబట్టి.. ఎలాగోలా మీట నొక్కాల్సిన అవసరం కనిపిస్తోంది మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close