కాళేశ్వరం అక్రమాలను తేల్చాలని ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కేసీఆర్ సహా అందర్నీ ప్రశ్నించింది. ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం ఏమింటే.. కొంత కీలకమైన సమాచారం ప్రభుత్వం నుంచి కావాల్సి ఉందని కానీ అది ప్రభుత్వం ఇవ్వడం లేదని అంటున్నారు. ఆ సమాచారం ఇవ్వనిది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పటికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి మూడు సార్లు లేఖలు అందాయి.కానీ స్పందించలేదు.
అసలు జస్టిస్ ఘోష్ కమిషన్ అడుగుతున్న సమాచారం ఏమిటంటే కాళేశ్వరంపై కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి ?. వాంగ్మూలాల్లో అధికారులు, రాజకీయ నేతలు భిన్నమైన వాంగ్మూలాలు ఇచ్చారు. ప్రతి నిర్ణయం కేబినెట్ ద్వారా జరిగిందని కేసీఆర్, హరీష్ రావు, ఈటల చెప్పారు. కానీ కమిషన్ అడగకపోయినా నాడు సబ్ కమిటీలో భాగంగా ఉన్న తుమ్మల మాత్రం కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
సబ్ కమిటీ రిపోర్టు ఇవ్వడానికి చాలా ముందే కాళేశ్వరం నిర్మాణానికి ముహుర్తం ఖరారు చేశారనికూడా ఆయన ఆధారాలు బయట పెట్టారు. ఈ గందరగోళం మధ్య.. అసలు కేబినెట్లో కాళేశ్వరం విషయంలో తీసుకున్న నిర్ణయాలపై పూర్తి సమాచారం కావాలని కమిషన్ ప్రభుత్వాన్ని అడిగింది. ముఖ్యంగా కేబినెట్ భేటీల మినిట్స్ అడిగింది. ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదు. కేబినెట్ లో చర్చించి..అనుమతి మేరకు ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే కాళేశ్వరంపై కేబినెట్ లో ఏం జరిగిందో తెలిసిపోతుంది.