రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పెన్షన్ల ప్రస్తావనేది..? గవర్నర్ ప్రసంగంలో పస లేదా..?

రుణమాఫీ, నిరుద్యో భృతి, పెన్షన్ల పెంపు వంటి ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల గురించి ప్రస్తావన లేకుండానే.. తెలంగాణ రెండో అసెంబ్లీలో గవర్నర్ తొలి ప్రసంగం నడిచిపోయింది. గత నాలుగున్నరేళ్లలో.. నీటిపారుదల రంగానికి రూ.77 వేల 777 కోట్లు ఖర్చు చేశామని … రాబోయే కాలంలో రూ.లక్షా 17 వేల కోట్ల విలువైన పనులు చేస్తామని ఘనంగా ప్రకటించారు. విద్యుత్‌ కోతలను అధిగమించి ప్రభుత్వం తొలి విజయం సాధించిందన్నారు. ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సంక్షేమ పథకాలను గవర్నర్ ఏకరవు పెట్టారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు చేపట్టాంమన్నారు. మార్చి నాటికి మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాల్లో ఇంటింటికి నల్లా నీరు ఇస్తామని ప్రకటించారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణఅని గవర్నర్ చెప్పుకొచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం తీసుకొచ్చామని రైతుబంధు పథకాన్ని ఆర్థికవేత్తలు, వ్యవసాయవేత్తలు ప్రశంసించారన్నారు. రైతు కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించేందుకు రైతుబీమా తీసుకొచ్చామని రూపాయి ఖర్చు లేకుండా రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇచ్చామని చేప్పుకొచ్చారు.

ఇలా గత నాలుగున్నరేళ్ల కాలంలో చేశామని చెప్పుకొచ్చారు.. అయితే సహజంగా.. ఎన్నికల తర్వాత తొలి అసెంబ్లీ సమావేశంలో… ప్రభుత్వాలు తమ లక్ష్యాలను గొప్పగా ప్రకటిస్తాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చబోతున్నామో.. దాని వల్ల ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో చెబుతారు. కానీ.. తెలంగాణ అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగంలో మాత్రం అలాంటివేమీ కనిపించలేదు. రూ. లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. పెన్షన్లు డబుల్ చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వాటి గురించి ప్రస్తావించలేదు. గత ప్రభుత్వంలోని సాధిచిన విజయాలను ఏకరవు పెట్టడంతోనే స్పీచ్ అంతా గడిచిపోయింది.

అందుకే గవర్నర్ ప్రసంగంపై.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సెటైర్లు వేశారు. అది కేసీఆర్ ప్రసంగం అని… గవర్నర్‌ కాపీ కొట్టారన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, రిటైర్మెంట్‌పై స్పష్టతలేదని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగంలో ముస్లిం రిజర్వేషన్లపై… మైనార్టీగా ప్రస్తావించారు.. దీనిపై స్ష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు. మొత్తానికి గవర్నర్ ప్రసంగంలో.. ఏ మాత్రం పస లేకపోయినప్పటికీ… నోరు మెదపడానికి విపక్షాలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితికి ఇది అద్దం పట్టింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close