ప్రజాస్వామ్యానికి గవర్నర్లతోనే ప్రమాదమా..?

రాష్ట్రానికి రాజ్యాంగాధినేత గవర్నర్. పేపర్ పై పవర్లన్నీ ఆయనకు ఉంటాయి. కానీ వాస్తవంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి అన్ని అధికారాలుంటాయి.ఈ ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్. అత్యధిక మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వారిని ముఖ్యమంత్రిగా నియమించడం ఆయన విధి. కానీ గవర్నర్లు ఏం చేస్తున్నారు..?. ఎవరెవరి సంగతో ఎందుకు.. ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ ఏం చేశారు..? మెజార్టీ లేకపోయినా.. సొంత పార్టీకి చెందిన నేతకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో.. గవర్నర్ల వ్యవస్థ అవసరమా అన్న చర్చ మళ్లీ ప్రారంభమయింది. ఎందుకంటే..ఇప్పుడు వజూభాయ్ వాలానే..చరిత్రలో చాలా మంది “వాలా”లున్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164 ప్రకారం అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ వచ్చిన పార్టీ ప్రతినిధిని ముఖ్యమంత్రిగా నియమించాలి. ఇక్కడ గవర్నరు విచక్షణతో పనిలేదు. 1952లో మొట్టమొదటిసారి యునైటెడ్‌ ఫ్రంట్‌ ద్వారా ఎన్నికైన టంగుటూరి ప్రకాశం పంతులుకు 166 సీట్లతో సంపూర్ణ మెజారిటీ ఉన్నా .. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజగోపాలాచారిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నరు శ్రీ ప్రకాశి ఆహ్వానించారు. ఈ పరంపర ఇక్కడితో ఆగలేదు. ఒరిస్సాలో 1973లో నందినీ శత్పథి రాజీనామా చేసిన తర్వాత ప్రగతి పార్టీ నాయకుడు బిజు పట్నాయక్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అప్పటి గవర్నర్‌ అంగీకరించలేదు. 1983-84 మధ్య ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న రామ్ లాల్ ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి.. కలకలం రేపారు. ఆ తర్వాత ప్రజల తిరుగుబాటుతో తోక ముడవక తప్పలేదు. అప్పటి నుంచి మొన్న గోవాలోనూ, అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ అదే వరస. ఇప్పుడు వజూభాయ్ వాలా కూడా అదే చేశారు.

గవర్నరు వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని 1983లోనే అనేక రాష్ర్టాలు సర్కారియా కమిషన్‌ను కోరాయి. ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ప్రతిపత్తితో రాష్ట్రాలు ఉన్నప్పుడు గవర్నర్ ద్వారా కేంద్రం నియంత్రణ ఎందుకని రాష్ట్రాలు ప్రశ్నించాయి. మాజీ ముఖ్యమంత్రులనూ, మంత్రులనూ, క్రియాశీల రాజకీయ నాయకులనూ రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమించడం నేరుగా రాజ్యాంగ విరుద్ధం. కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయమై 1988లో విలువైన సూచనలు చేసిన సర్కారియా కమిషన్‌ సమగ్రమైన ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా గవర్నర్ల విషయంలో ఏ రాజకీయ సంబంధంలేని నిపుణులనే గవర్నర్లుగా నియమించాలని చాలా గట్టిగా చెప్పింది.

సర్కారియా కమిషన్‌ మొర విన్న నాథుడు లేడు. కానీ కేంద్రం చేతిలో తొత్తులుగా ఉండి.. రాజకీయ అవసరాలు కూడా తీరుస్తూండటంతో.. గవర్నర్లను కేంద్రం తమ ఎజెంట్లుగా రాజ్‌భవన్‌లో కూర్చొబెడుతూనే ఉంది. ఫలితంగా ప్రజాస్వామ్యానికి బీటలు పడుతూనే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close