టీడీపీలోకి గౌరు కుటుంబం..!?

కర్నూలు జిల్లాలో మరో కీలక వైసీపీ నేత.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి జగన్ తమను అవమానిస్తున్నారన్న భావనలో ఉన్నారు. పాణ్యం అసెంబ్లీ టిక్కెట్ విషయంలో చివరి క్షణంలో హ్యాండిస్తారని అనుమానిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం కాటసాని రాంభూపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న జగన్.. పాణ్యం టిక్కెట్ హామీ ఇచ్చారు. అయితే.. జగన్ అలా చేయరని.. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న తమను కాదని.. కొత్తగా పార్టీలో చేర్చుకున్న వారికి అవకాశం ఇవ్వరని ఇంత కాలం భావించారు. కానీ రాను రాను పార్టీ కార్యక్రమాల్లో గౌరు దంపతులను జగన్ పట్టించుకోవడం మానేశారు. కాటసాని రాంభూపాల్ రెడ్డికే టిక్కెట్ అన్న సూచనలు రావడం.. కనీసం తమను పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా జగన్ చేయకపోవడంతో.. గౌరు దంపతులు.. తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది.

నిజానికి గౌరు కుటుంబం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మీయులు. గతంలో జైలు శిక్ష పడిన గౌరు వెంకటరెడ్డిని.. తను సీఎం అయిన కొద్ది కాలంలోనే క్షమాభిక్ష ప్రసాదింపచేసి మరీ విడుదల చేయించారు వైఎస్. అందుకే ఆ తర్వాత వారు జగన్ వెంట నడిచారు. కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా గౌరు వెంకటరెడ్డి వ్యవహరించారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ తరపున పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత శిల్పా సోదరులు.. వైసీపీలో చేరారు. ఓ వైపు… తమకు ప్రత్యర్థిగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం.. మరో వైపు శిల్పా బ్రదర్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ.. గౌరు వర్గాన్ని మాత్రం దూరం పెడుతున్నారు. జగన్ తత్వం తెలిసిన గౌరు దంపతులు… తమను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నంలో ఉన్నారని నిర్ణయించుకున్నారు.

కొన్నాళ్ల క్రితం.. గౌరు చరిత సమీప బంధువు మాండ్ర శివానందరెడ్డి.. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన నందికొట్కూరు టీడీపీ ఇన్చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. మాండ్ర శివానందరెడ్డి టీడీపీలో చేరినప్పటి నుంచే .. జగన్.. గౌరు దంపతులపై.. అనుమానం పెంచుకున్నారని.. వారు … తన పార్టీలో ఉండరన్న ఉద్దేశంతోనే… క్రమంగా దూరం పెట్టడం ప్రారంభించారని.. పాణ్యం నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అందుకే బీజేపీలో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. పాణ్యంలో టీడీపీ తరపున పలువురు ఆశావహులున్నారు. వారిలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ముఖ్యులు. అయితే ఏరాసుకు సర్ది చెప్పి… గౌరు కుటుంబానికి టీడీపీ టిక్కెట్ కేటాయించే అవకాశం ఉంది. అందుకే.. వచ్చే నెల ఆరో తేదీన వారు టీడీపీలో చేరుతారని కర్నూలు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్సిడెంట్ కేసులో ర‌ఘుబాబు

సినీ న‌టుడు ర‌ఘుబాబు చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న‌పై ఓ యాక్సిడెంట్ కేసు న‌మోదైంది. హైద‌రాబాద్ నుంచి గుంటూరు కారులో వెళ్తున్న ర‌ఘుబాబు న‌ల్గొండ జిల్లా నార్క‌ట్ ప‌ల్లి - అద్దంకి ర‌హ‌దారి వ‌ద్ద...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

నాటి టీడీపీ పరిస్థితే నేడు వైసీపీది !

2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జాతీయ సర్వేలు వచ్చాయి. ఆ సర్వేలన్నింటిలో.. వైసీపీ భారీ విజయం సాధించబోతోందని అంచనా వేశాయి. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అవన్నీ పెయిడ్...

వైసీపీని “చెత్త కుప్ప”ల్లోకి చేర్చిన అంబటి రాంబాబు !

ఎన్నికల ప్రచారం చేయాలంటే ఓ ఆలోచన ఉండాలి. కానీ ఆ ఆలోచన వింతగా ఉంటే మాత్రం రివర్స్ అవుతుంది. దానికి అంబటి రాంబాబే సాక్ష్యం. ఇప్పుడు సత్తెనపల్లిలో ఎక్కడ చూసినా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close