రాంగోపాల్ వర్మకు విజయవాడలో ఘనస్వాగతం

హైదరాబాద్: ‘వంగవీటి’ చిత్రంకోసం కొన్ని రహస్యాలు తెలుసుకోవటానికి ఈ సాయంత్రం హైదరాబాద్‌నుంచి విజయవాడ వెళ్ళిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఘన స్వాగతం లభించింది. ఈ చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గన్నవరం విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించారు. దీనితో వర్మ బాగా సంతోషంగా కనిపించారు. పోలీసులు కూడా విమానాశ్రయంవద్ద పెద్దసంఖ్యలో మోహరించారు. వివాదాల నేపథ్యంలో వర్మను వెనక్కు పంపిస్తారని ఒక సమయంలో భావించినప్పటికీ అలా జరగలేదు. కారు ఎక్కుతుండగా మీడియా ప్రతినిధులు సంప్రదించగా, మూడు రోజులపాటు విజయవాడలో ఉంటానని వర్మ చెప్పారు. విజయవాడ రావటం ఎలా ఉందని అడగగా, బెజవాడ తనకు పుట్టినిల్లు లాంటిదని అన్నారు. విజయవాడలో ఎవరెవరిని కలవబోతున్నారని అడగగా, అన్ని కుటుంబాలవారినీ కలుస్తానని చెప్పారు. ఇంత ఘనస్వాగతం లభించటం ఎలా ఉందని అడగగా, తాను తీయబోతున్న సినిమా ఇక్కడివాళ్ళకు సంబంధించినది కావటంతో వారు తరలివచ్చారని వర్మ అన్నారు. మరోవైపు రాంగోపాల్ వర్మ గన్నవరంలో విమానం దిగే సమయానికే కాంగ్రెస్ నాయకుడు దేవినేని నెహ్రూ కూడా బెంగళూరునుంచి రాబోతున్నారని తెలియటంతో అక్కడ కొద్ది సేపు ఉత్కంఠ నెలకొంది. నెహ్రూ కారు ఎయిర్‍‌పోర్ట్‌వద్ద వేచిఉండటంతో ఆయన, వర్మ ఒకే ఫ్లైట్‌లో వస్తున్నారేమోనని భావించారు. అయితే నెహ్రూ తనకు ఫ్లైట్‌లో కలవలేదని వర్మ చెప్పారు. ఇదిలాఉంటే వర్మ బస చేస్తున్న ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్‌‌ వద్ద పోలీసులు బందోబస్తును పటిష్ఠం చేశారు. ఈ రాత్రికి వంగవీటి రాధాను వర్మ కలుస్తారని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close