రాజకీయంగా ఎవరికి వారే! – ఆర్ధికంగా అందరూ ఒకటే!

రాజకీయంగా ఎన్ని విబేధాలు వున్నా ఆర్ధిక అంశాలలో ఏరాజకీయపార్టీకీ రెండో అభిప్రాయం లేదని స్ధానికతను, స్వతంత్రతను, వైవిధ్యాన్ని హరించివేయడాన్ని రాజకీయంగా వ్యతిరేకించే రాజకీయ పార్టీలు, ఆర్ధికంగా తమహక్కున్ని పోగొట్టుకోడానికి కూడా సిద్ధమే అనడానికి చట్టంకాబోతున్న జి ఎస్ టి బిల్లే పెద్ద సాక్ష్యం!

పన్నుల హెచ్చింపు లేదా తగ్గింపు ద్వారా తమ ప్రజల అవసరాల్ని, అనవసరాల్ని నియంత్రించే అధికారాల్ని, అవకాశాల్ని జి ఎస్ టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) వల్ల రాష్ట్రప్రభుత్వాలు కోల్పోతున్నాయి. పెద్దపెద్ద బ్రాండ్లతో పోటీపడితే తప్ప, చిన్నతరహా పరిశ్రమలు మనుగడసాగించే పరిస్ధితి వుండదు.

ఇపుడు ఆరు దశల్లో కేంద్రం పన్నులు వేస్తుండగా జిఎస్‌టి వస్తే ఒకే పన్ను వసూలు చేస్తుంది. రాష్ట్రాలకు పన్నులు వేసే అధికారం వుండదు. సేవా పన్ను వేసుకోవచ్చు. ఇందువల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పనరుల కోసం ప్రతిరాష్ట్రంలోనూ సర్వీసు టాక్సులు పెరుగుతాయి. జిఎస్‌టి సామాన్య ప్రజలపై కొత్త పన్నుల భారం పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీని వల్ల ద్రవ్యోల్బణం ఇబ్బిడిముబ్బిడి అవుతుందని చెబుతున్నారు. జిఎస్‌టి వల్ల రెడీమేడ్‌ దుస్తులు, టీవీలు, తక్కువ ధర కార్లు, మీడియా సేవల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఔషధాల రేట్లు పెరగడం ఆందోళన కలిగించే అంశం. అలాగే ఫోన్‌ బిల్లులు, బ్యాంకింగ్‌ సేవల ఆర్ధిక భారాలు పెరుగుతాయి. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు, సిగరేట్లు, ఆభరణాలు, బ్రాండెడ్‌ దుస్తుల ధరలూ పెరుగుతాయి.

జిఎస్‌టి మౌలికమైన మార్పనీ, విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుతుందని, ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని కేంద్రప్రభుత్వం అదేపననిగా చెబుతోంది. జాతీయ స్థూలోత్పత్తి ఏడాదికి రెండు శాతం పెరుగుతుందనని ప్రచారం చేస్తున్నారు.

జిఎస్‌టి అమలు చేసిన కెనడా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలో ద్రవ్యోల్బణం పెరిగింది. వ్యాట్‌ను అమలు చేసిన యూరప్‌ ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. ప్రపంచ అనుభవాలను పక్కనపెట్టి అన్ని సమస్యలకూ జిఎస్‌టి ఒక్కటే పరిష్కారం చూపుతుందనడం ప్రజలను తప్పుదారి పట్టించడానికే. అదేనిజమైతే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికా ఎందుకని బహుళ పన్నులు విధిస్తోంది?

అమెరికా రాష్ట్రాలకు పన్నులు విధించే హక్కు కల్పించి ఫెడరల్‌ వ్యవస్థను పటిష్టం చేసింది. మన దేశంలో జిఎస్‌టి వలన రాష్ట్రాలు పన్నులు విధించే హక్కును కోల్పోతున్నాయి. ఈ పరిణామం రాజ్యాంగం కల్పించిన ఫెడల్‌ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం. పన్నులు అవసరాలు, ప్రాధాన్యతలు,రాష్ట్రానికి, రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు ముందుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఎంచుకునే ప్రధాన్యతలబట్టి పన్నులు వేస్తాయి. జిఎస్‌టి ఆ హక్కును హరిస్తోంది.

జిఎస్‌టిని ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించిన 122వ రాజ్యాంగ సవరణకు అన్నాడిఎంకె మినహా రాజ్యసభలోని పార్టీలన్నీ మద్దతు పలకడం చారిత్రాత్మకమే.

జిఎస్‌టి పర్యవసానాలపై వివిధ పార్టీలు వెలిబుచ్చిన సందేహాలు, అభిప్రాయాలు, సూచనలు, భయాందోళనలు, వాటిపై కేంద్రం ఇచ్చిన వివరణలు, హామీల అమలు మొదలైనవాటికి సమాధానాలు భవిష్యత్తులో తెలుస్తాయి.

రాజ్యసభలో ఎన్ డి ఎ ప్రభుత్వానికి సాధారణ మెజార్టీ లేనందున ఆగింది. పైగా రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో సభలో రెండింట మూడు వంతుల మెజార్టీ కావాలి. సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాలి. అందుకే బిజెపి ప్రభుత్వం విధిలేని పరిస్థితులో ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని అవి సూచించిన ముఖ్య సవరణలు చేయడానికి అంగీకరించింది. వస్తూత్పత్తిపై రాష్ట్రాలు విధించే ఒక శాతం సుంకం రద్దు, పన్ను పరిమితి 18 శాతం లోపు, రాష్ట్రాలకు ఐదేళ్లపాటు నష్ట పరిహారం వంటి ప్రతిపక్షాల కీలక డిమాండ్లకు సర్కారు తలొగ్గింది. ఆ మేరకు ప్రభుత్వమే బిల్లులో ఆరు సవరణలను ప్రతిపాదించింది. దీంతో జిఎస్‌టికి మార్గం సుగమం అయింది. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు మళ్లీ లోక్‌సభ ఆమోదించాలి. తదుపరి జిఎస్‌టి అమలుపై విధి, విధానాలు రూపొందించే బిల్లు నవంబర్‌లో పార్లమెంట్‌ ముందుకొస్తుంది.

అది కూడా ఆమోదం పొందాక వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి జిఎస్‌టి అమల్లోకిరావాలి. కానీ మరో సంవత్సరం అంటే 2018 మధ్యవరకూ జి ఎస్ టి అమలులోక వచ్చే అవకాశంలేదని అధికారులే చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close