రివ్యూ: ఘాటు త‌క్కువైన‌…. గుంటూరోడు

కమ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌తో చాలా సౌల‌భ్యాలుంటాయి. మాస్‌కి వెంట‌నే ఎక్కే అవ‌కాశాలుంటాయి. ఓపెనింగ్స్‌కి తిరుగుండ‌దు. కాస్తంత అల‌రించే ల‌క్ష‌ణాలున్నా బీ, సీ సెంట‌ర్ల‌లో కొన్నాళ్ల‌పాటు నిల‌బ‌డిపోతాయి. క‌థానాయ‌కులూ కొత్త‌ద‌నం ఉందా లేదా అంటూ క‌థల గురించి ప‌దే ప‌దే చూసుకోవ‌ల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఓ మంచి సెట‌ప్ కుద‌ర‌గానే ఆలోచించ‌కుండా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేయొచ్చు. అందుకే త‌రుచుగా క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లు మ‌న తెర‌పైకొస్తుంటాయి. అయితే మ‌నోజ్ మాత్రం కొత్త క‌థ‌ల‌పైనే మ‌న‌సు పెడుతూ మాస్ క‌థ‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. త‌న పాత్ర‌ల్లో మాస్ కోణాన్ని ఆవిష్క‌రించాడు త‌ప్ప ఆయ‌న ఫ‌క్తు మాస్ క‌థ‌లు చేసింది లేదు. ఆ విష‌యం మ‌నోజ్‌కీ, ద‌ర్శ‌కుడికీ ఒకేసారి గుర్తుకొచ్చుండొచ్చేమో. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌తో `గుంటూరోడు` చేసేశారు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? ఎప్పుడూ మాస్‌గా క‌నిపిస్తూ సంద‌డి చేసే మ‌నోజ్ మాస్ క‌థ‌లో ఎలా ఒదిగిపోయాడో తెలుసుకొందాం…

* క‌థ

ఆనందం వ‌చ్చినా.. కోపం వ‌చ్చినా త‌ట్టుకోలేని గుంటూరు అబ్బాయి క‌న్నా (మంచు మ‌నోజ్‌). త‌ల్లి లేని త‌న ఒక్క‌గానొక్క కొడుకైన క‌న్నా అంటే తండ్రి సూర్య‌నారాయ‌ణ (రాజేంద్ర్రప్ర‌సాద్‌)కి చాలా ఇష్టం. చిన్న‌ప్ప‌ట్నుంచి గారాభంగా పెంచుతాడు. ఆ గారాభం వ‌ల్ల పెద్ద‌య్యాక ఎప్పుడూ ఎవ‌రినో ఒక‌రిని కొట్టేసి ఇంటిమీదికి గొడ‌వ‌లు తెచ్చేస్తుంటాడు. అందుకే మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసేయాల‌ని నిర్ణ‌యిస్తాడు. పెళ్లి చూపుల్లో అమ్మాయి ప‌క్క‌నున్న అమృత (ప్ర‌గ్యా)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. అంత‌లోనే ఓ హోట‌ల్‌లో ఎమ్మెల్యే కావాల‌నుకొన్న ఓ క్రిమిన‌ల్ లాయ‌ర్ శేషు (సంప‌త్‌రాజ్‌)తో గొడ‌వ‌ప‌డి త‌ల ప‌గ‌ల‌గొడ‌తాడు క‌న్నా. అస‌లే అహంకారి, కోప‌స్థుడైన శేషు క‌న్నాపై క‌క్ష‌గట్టి చంపేయాల‌ని నిర్ణ‌యించుకొంటాడు. క‌న్నా ప్రేమించిన అమృత ఎవ‌రో కాదు… శేషు చెల్లెలే. మ‌రి క‌న్నా, అమృత ప్రేమ విష‌యం తెలిశాక శేషు ఏం చేశాడు? వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ కంచికి చేరిందా లేదా? అస‌లు శేషు ఎమ్మెల్యే అయ్యాడా? త‌దిత‌ర విష‌యాలు సినిమాలోనే చూడాలి.

* విశ్లేష‌ణ‌

కొత్త క‌థ‌లు తెర‌పైకి ఎప్పుడో కానీ రావు కాబ‌ట్టి ప్రేక్ష‌కులూ ఆ విష‌యంలో పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోవ‌డం లేదు. తెలిసిన క‌థ‌నైనా స‌రే… కొత్త ర‌క‌మైన క‌థ‌నంతో, స‌న్నివేశాల‌తో తీర్చిదిద్దితే చాలంటూ టికెట్టు కొంటారు. కానీ ద‌ర్శ‌కులు ఆ విష‌యంలోనూ నిరాశే మిగులుస్తున్నారు. అందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా గుంటూరోడు సినిమా నిలుస్తుంది. తొలి స‌న్నివేశం నుంచి, క్లైమాక్స్ వ‌ర‌కు అంతా ఊహించుకోద‌గ్గ‌దే. అన్నీ చూసేసిన స‌న్నివేశాలే. క‌మ‌ర్షియ‌ల్ సినిమా అంటే కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సూత్రాలే కాదు, దానికి ఆక‌ట్టుకొనే ఓ క‌థ‌, క‌థ‌నం కూడా తోడు కావాల‌నే విష‌యాన్ని చిత్ర‌బృందం మ‌రిచిపోయిన‌ట్టుంది. అందుకే హీరోయిజం, ఫైట్లు, పాట‌లు, రొమాన్స్‌… ఇలా కేవ‌లం ఆ ముడిస‌రుకునే మ‌రోమారు తెర‌పైకి తీసుకొచ్చి సినిమా అయింద‌నిపించారు. కొత్త క‌థ‌లు చేసినా స‌రైన ఫ‌లితం రావ‌డం లేదు, ఈ ఒక్క‌సారికి మ‌న‌కు అలవాటైన క‌థ‌నే చేసి చూద్దామ‌నే మ‌నోజ్ ఈ సినిమాని ఒప్పుకొన్న‌ట్టున్నాడేమో అనిపిస్తుంది… క‌థల విష‌యంలో ఆయ‌నకున్న టేస్ట్‌ని ఓసారి మ‌న‌నం చేసుకొన్నాక‌!

క‌థానాయ‌కుడు క‌న్నా బాల్యం గురించి వివ‌రించే చిరు వాయిస్ ఓవ‌ర్‌తో సిన‌మా మొద‌ల‌వుతుంది. పెద్ద‌య్యాక గుంటూరు మార్కెట్లో రైతుని మోసం చేసేందుకు ఓ వ్యాపారి ప్ర‌య‌త్నించ‌డం, దాన్ని అడ్డుకొంటూ హీరో త‌న హీరోయిజాన్ని చూపించ‌డం వంటి రొటీన్ స‌న్నివేశాల‌తో మొద‌లై… చివ‌రి వ‌ర‌కు ఆ ఫార్ములాని త‌ప్ప‌కుండా అలా సాగిపోతుంది సినిమా. ఈ క‌థ‌లో హీరోయిజం, ఫైట్లు, రొమాన్స్‌, విల‌నిజం, కామెడీ, సెంటిమెంట్‌… ఇలా అన్నింటికీ ఆస్కార‌మున్నా ఏదీ పండ‌లేదు. ఒక స‌న్నివేశం త‌ర్వాత ఒక స‌న్నివేశం సాగిపోతుంది త‌ప్ప ఏ ఒక్క చోట హై అనిపించ‌దు. ఎలాగో కొత్త క‌థ చెప్ప‌న‌ప్పుడు అందులో మాస్ అంశాల్నైనా బ‌లంగా పండించే ప్ర‌య‌త్నం చేయాల్సింది. కానీ ఆ విష‌యంలోనూ ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. క‌థ‌లోనూ చాలా లోపాలు క‌నిపిస్తాయి. ఒక‌డు బీర్ బాటిల్‌తో కొట్టాడు కాబ‌ట్టి, వాడిని అంతం చేయాల‌ని విల‌న్ క‌క్షగ‌ట్ట‌డమ‌నే ఓ చిన్న అంశం చుట్టూనే సినిమా మొత్తం సాగుతుంది. ఆ చిన్న అంశం అటు హీరోయిజాన్ని పండించ‌లేదు, ఇటు విల‌నిజాన్నీ ఎలివేట్ చేయ‌లేదు. క‌థ రీత్యా తండ్రీ కొడుకుల బంధం, అన్నా చెల్లెల్ల బంధాల చుట్టూ కూడా బ‌లమైన స‌న్నివేశాల్ని తీర్చిదిద్ద‌వ‌చ్చు. కానీ ఆ అవ‌కాశాన్ని కూడా ద‌ర్శ‌కుడు వృథా చేశాడు. ప‌తాక స‌న్నివేశాలు మ‌రీ చ‌ప్ప‌గా సాగుతాయి. కామెడీ విష‌యంలోనూ పూర్తిగా అశ్ర‌ద్ధ చేశాడు. పృథ్వీ, ప్ర‌వీణ్‌, స‌త్య‌లాంటి న‌టులు ఉన్నా ఎక్క‌డా న‌వ్వులు పండ‌లేదు.

* న‌టీన‌టులు

మంచు మ‌నోజ్ త‌న‌కి ప‌ట్టున్న పోరాట ఘ‌ట్టాల్లో చాలా బాగా న‌టించాడు. భావోద్వేగాల‌పైనా దృష్టిపెట్టాడు కానీ.. స‌న్నివేశాల్లో బ‌లం లేక‌పోవ‌డంతో అవి పండ‌లేదు. ప్ర‌గ్యా జైశ్వాల్ చలాకీగా క‌నిపిస్తూ త‌న అందంతో ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేసింది. త‌న ప‌రిధి మేర‌కు బాగానే న‌టించింది. ఇక సంప‌త్ రాజ్ ఓ కోపిష్టి క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా ఫ‌ర్వాలేద‌నిపిస్తాడు. కోట శ్రీనివాస‌రావు వృధ్ధ రాజ‌కీయ నాయ‌కుడిగా ర‌క్తిక‌ట్టించాడు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌లాంటి న‌టులున్నా వాళ్ల‌ని పెద్ద‌గా వాడుకొన్న‌దేమీ లేదు. ఆ పాత్ర‌లు తేలిపోయాయి. హీరో స్నేహితులుగా క‌నిపించిన కామెడీ గ్యాంగ్ కొన్ని స‌న్నివేశాల్లోనే ప్ర‌భావం చూపించారు.

* సాంకేతికత‌

శ్రీవ‌సంత్ పాట‌ల్లో రెండు బాగున్నాయి. వాటి చిత్ర‌ణ కూడా బాగుంది. ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకి కాస్త‌లో కాస్త బ‌లం. అక్క‌డ‌క్క‌డ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి. ద‌ర్శ‌కుడు తాను రాసుకొన్న క‌థ‌ని ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్ లేకుండా తీశాడు కానీ… కొత్త‌ద‌నం అనే విష‌యాన్ని ఆయ‌న అస్స‌లు ప‌ట్టించుకోలేదు. కామెడీ, రొమాన్స్‌, సెంటిమెంట్‌లాంటి మాస్ అంశాలు బ‌లంగా పండితేనే క‌మ‌ర్షియ‌ల్ సినిమా అనే విష‌యం ఆయ‌న‌కి ఈ సినిమాతో అనుభ‌వ‌మ‌వుతుంది.

* ఫైన‌ల్ ట‌చ్ … స‌రుకు త‌క్కువ‌.. సౌండు ఎక్కువ‌!

తెలుగు360.కామ్ రేటింగ్ 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close