రివ్యూ: గుర్తుందా శీతాకాలం

Gurthunda Seethakalam Movie Telugu Review

తెలుగు360 రేటింగ్ 2.25/5

జీవితం జ్ఞాపకాల సమాహారం. అందులో ప్రేమకి సంబధించిన జ్ఞాపకాలు మరింత ప్రత్యేకం. మంచి, చెడు ఏదైనా ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవడంలో ఒక ఆనందం వుంటుంది. అందుకే వెండితెరపై ప్రేమ తాలూకు జ్ఞాపకాలని నెమరువేసుకునే చిత్రాలు పలకరిస్తూనే వుంటాయి. మై అటో గ్రాఫ్ స్వీట్ మెమోరీస్, ప్రేమమ్, 96 .. చాలా చిత్రాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసుకున్నాయి. కన్నడలో విజ‌య‌వంత‌మైన `ల‌వ్ మాక్ టైల్‌` కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇప్పుడు అదే సినిమాని `గుర్తుందా శీతాకాలం`పేరుతో తెలుగులో రిమేక్ చేశారు. మరీ రీమేక్ లో `ల‌వ్ మాక్ టైల్‌` మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యిందా ? ఈ శీతాకాలం ఎలాంటి గుర్తులను అందించింది?

దేవ్ (సత్యదేవ్) స్కూల్స్ డేస్ లో కోమలి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కోమలి నోరు తెరిస్తే ఆంగ్లమే. దేవ్ కి ఇంగ్లీష్ రాదు. దీంతో ఆ ప్రేమకి ఫుల్ స్టాప్ పడిపోతుంది. దేవ్ ఇంజనీరింగ్ లో వుండగా అమృత (కావ్యశెట్టి) ని ఇష్టపడతాడు. ఘాడంగా ప్రేమిస్తాడు. అమృత చాలా రిచ్. చదువు పూర్తయ్యాక 22 వేల రుపాయిల ఉద్యోగంలో కుదురుకుంటాడు దేవ్. అమృతని బాగా చూసుకోవాలని కష్టపడతాడు. అయితే అమృత స్టేటస్ కి దేవ్ సంపాదన సరితూగదు. అదే వారి ప్రేమకి అడ్డంకి గా మారుతుంది. దేవ్ జీవితం నుండి అమృత వెళ్ళిపోతుంది. బ్రేక్ అఫ్ బాధ నుండి ఇంకా కోలుకోక ముందే దేవ్ జీవితంలోకి నిధి ( తమన్నా) వస్తుంది. మరి నిధితో దేవ్ జీవితం ఎలా సాగింది ? వీరి ప్రయాణం ఏ తీరాలకు చేరింది ? అనేది మిగతా కథ.

`గుర్తుందా శీతాకాలం`ని కథ గా చెప్పడం కంటే సంఘనల సమాహారంగా చెప్పడం సముచితంగా వుంటుంది. దేవ్ తన ప్రేమప్రేమతాలూకు జ్ఞాపకాలని దివ్య ( మేఘా ఆకాష్) తో పంచుకోవడంతో కథ మొదలౌతుంది. దేవ్ జీవితంలో మొత్తం మూడు ప్రేమ కథలు వుంటాయి. స్కూల్ డేస్ లో కోమలితో ప్రేమ.. చిన్న ఎపిసోడ్ నే. అయితే అందులో నుండి ప్రశాంత్ (ప్రియదర్శి ) గీత( వర్షిని ) పాత్రలో దేవ్ జీవితంతో పాటు కొనసాగడానికి ఆ ట్రాక్ చక్కగా వాడుకున్నారు. ఇంగ్లీష్ రాక దేవ్ పడేపాట్లు నవ్విస్తాయి. కాలేజీ డేస్ లో అమృత, దేవ్ ల ప్రేమ ప్రధమార్ధంలో జోష్ తెప్పిస్తుంది. అప్పట్లో సెల్ ఫోన్ వాడకం, రీచార్జులు చుట్టూ అల్లుకున్న మాటలు నవ్విస్తాయి. ఆ ట్రాక్ ని మొదట్లో చాలా హుషారుగా నడిపారు. అయితే ఎక్కడైతే స్టేటస్ సింబల్ తెరపైకి వచ్చిందో అక్కడి నుండి కాస్త రొటీన్ గానే అనిపిస్తుంది. అయితే దాన్ని మరీ ఎక్కువగా కొనసాగించలేదు. నిధి పాత్రని ప్రవేశపెట్టి.. కథలో అసలు సంఘర్షణకు పునాదులు వేశాడు దర్శకుడు.

ఇలాంటి కథలకు ద్వితీయార్ధం చాలా కీలకం. దేవ్ జీవితంలో మూడో ప్రేమ కథగా నిధి ప్రవేశిస్తుంది. అయితే ఆ పాత్ర ద్వారా వచ్చిన సంఘర్షణ ఇది వరకూ చాలా సినిమాల్లో చూసినదే. పైగా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు కూడా రొటీన్ గానే లాగించేశారు. అమృత క్యారెక్టర్ మళ్ళీ ప్రవేశపెట్టడం.. ఫస్ట్ నైట్ ప్రిపరేషన్, బర్త్ డే విశేష్ గురించి నడిపిన ఎపిసోడ్ .. .. ఇవన్నీ సుదీర్గంగా అనిపిస్తాయి. ఎప్పుడైతే కథ ఫైనల్ పాయింట్ కి రీచ్ అయ్యిందో హెవీ సెంటిమెంట్ వైపు వెళుతుంది. అయితే సెంటిమెంట్ ని రాబట్టుకోవడం కూడా ఒక కళ. బలమైన సన్నివేశం ఉన్నపుడే అది పండుతుంది. అలా హృదయాన్ని మెలిపెట్టే సన్నివేశాలు ఇందులో కరవయ్యాయి. అయితే చివర గా ఒక ఫీల్ గుడ్ మూమెంట్ తో లైటర్ వెయిన్ లో కథని ముగించడం బావుంది.

సత్యదేవ్ కు మరోసారి నటించే అవకాశం ఇచ్చిన పాత్ర దేవ్. కాలేజీలో వున్నప్పుడు ఎంత హుషారుగా ఉంటాడో ఒక్కసారి అసలైన ప్రపంచంలోకి వచ్చినపుడు తన పాత్రలో వచ్చిన మార్పుని చాలా సహజంగా అద్భుతమైన గ్రాఫ్ ని చూపించాడు. తన కెరీర్ కోసం కష్టపడుతున్నపుడు దేవ్ తో చాలా మంది కనెక్ట్ అవుతారు. తన బాడీ లాంగ్వేజ్ చాలా బావుంది. ఎమోషనల్ సీన్స్ చేయడంలో మరో మెట్టు ఎదిగాడు. తమన్నా కొత్తగా కనిపించింది. చాలా డీసెంట్ పాత్ర అది. తన అనుభవం చూపించింది. కావ్య శెట్టి అందంగా వుంది. అభినయం కూడా ఓకే. అయితే ఆమె ప్రేమలో క్లారిటీ లేకపోవడం ఏమిటో కానీ కొన్ని చోట్ల క్లూ లెస్ గా కనిపిస్తుంది. మేఘా ఆకాష్ క్యూట్ గా వుంది. ప్రియదర్శి, వర్షిణి పాత్రలు బావున్నాయి. సుహాసిని చిన్న పాత్రలో కనిపించింది. మిగతా పాత్రలు పరిధి మేర వున్నాయి.

విజువల్స్ డీసెంట్ గా వున్నాయి. వెండి తెర మొత్తం ప‌చ్చ‌ద‌నం పులుముకొంది. ఇలాంటి సినిమాలకి సంగీతానికి చాలా ప్రాధాన్యత వుంది. కాలభైరవ గుర్తుపెట్టుకునే ట్యూన్స్ ని చేయాల్సింది. శీతాకాలం పాట వినసొంపుగా ఉంది. కెమెరాపని తనం బావుంది. ముఖ్యంగా లక్ష్మీ భూపాల రాసిన మాటలకు మంచి మార్కులు పడతాయి. చాలా సీన్స్ ని ఆయన మాటలతోనే నెట్టుకొచ్చారు. ‘అబ్బాయిలు కన్ఫ్యుజన్ లోనే ప్రేమ, పెళ్లి చేసుకుంటారు.. అదో శాపం’ అనే మాటకు థియేటర్స్ లో విజల్స్ పడతాయి. ‘కుర్రాడు విజల్ వేస్తాడని అనుకుంటే కుక్కర్ విజలేసినట్లుంది”…ఇలాంటి సరదా మాటలు ఇందులో చాలా వున్నాయి. నిర్మాణ విలువలు ఓకే. ‘లవ్ మాక్ టైల్’ మ్యాజిక్ ని రిక్రియేట్ చేయాలని ప్రయత్నం `గుర్తుందా శీతాకాలం`లో జరిగింది. అయితే ఇందులో కొత్తగా గుర్తుపెట్టుకునే జ్ఞాపకాలు మాత్రం తక్కువే.

షినిషింగ్ ట‌చ్‌: కొన్ని గురుతులే!

తెలుగు360 రేటింగ్ 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close