జీవీఎల్‌కు వైసీపీపై కోపం వచ్చింది..!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలకు జరపాలని కేంద్రమే ఆదేశించిందని.. తమను ఎందుకు విమర్శిస్తున్నారని వైసీపీ నేతలు.. నిన్నటి నుంచి .. విపక్ష పార్టీపై రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. పేర్ని నాని నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేరును ప్రస్తావించి మరీ చెప్పారు. ఈ విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పందించారు. మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని.. కేంద్ర ప్రభుత్వమే ఓపెన్ చేయమని చెప్పిందని ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం లేదని రాష్ట్రాలన్నీ కేంద్రంపై ఒత్తిడి చేస్తే వైన్ షాపులు తెరుచుకోవాలని మాత్రమే కేంద్రం చెప్పిందని.. తెరుచుకోవడానికి.. మూసివేసి ఉంచడానికి నిర్ణయం మొత్తం రాష్ట్రాలదేనని జీవీఎల్ స్పష్టం చేశారు.

కేంద్రం తెరవాలని ఆదేశిస్తే.. కొన్ని రాష్ట్రాలు ఎందుకు ఇంకా తెరవలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని కేంద్రంపై రుద్దడం సరి కాదని మండిపడ్డారు. 75 శాతం ధరలు పెంచి అమ్మాలనే నిర్ణయం రాష్ట్రానిది కాదా అని ప్రశ్నించారు. మధ్యనిషేధం అంటున్న వైసీపీ మళ్లీ వైన్ షాపులు ఎందుకు తెరిచిందని.. మద్యనిషేధానికి ఇంత కన్నా మంచి సమయం మళ్లీ దొరకదనే విషయం తెలియదా అని జీవీఎల్ మండిపడ్డారు. ఇటీవలి కాలంలో జీవీఎల్ ఏపీ రాజకీయాల్లో భిన్నమైన పంధాను అవలంభిస్తున్నారు. వైసీపీ నేతలు.. బీజేపీని ఎంత టార్గెట్ చేసినా.. ఒక్క మాట కూడా స్పందించడం లేదు.

విజయసాయిరెడ్డి లాంటి నేతలు బీజేపీ అంతర్గత విషయాలపై ఆరోపణలు చేసినా జీవీఎల్ సైలెంట్ గానే ఉన్నారు. తప్పని సరి పరిస్థితుల్లో స్పందించాల్సి వస్తే.. ఆయన టీడీపీపైనే రివర్స్‌లో విమర్శలు చేస్తూ ఉంటారు. దాంతో ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు గట్టిగానే వచ్చాయి. ఇప్పుడు కూడా.. ఆయన తమపై ఆరోపణలు చేస్తున్న వైసీపీని మాత్రమే టార్గెట్ చేయలేదు. టీడీపీని కూడా కలిపేసి.. జనరలైజ్ చేసేశారు. టీడీపీ, వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని తేల్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close