హైద‌రాబాద్, మ‌తం, సీఏఏ… అన్నీ క‌లిపేసిన జీవీఎల్!

కేంద్రంలోని మోడీ స‌ర్కారు సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలు కొన్ని తీసుకుంది. క‌శ్మీరులో 370 ర‌ద్దుగానీ, ట్రిపుల్ త‌లాక్ బిల్లుగానీ ఇలాంటివాటిపై ప్ర‌జల నుంచి కూడా మంచి మ‌ద్ద‌తే వ‌చ్చింది. అయితే, ఇప్పుడీ సీఏఏ మీద దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌ధాని ఏ నిర్ణ‌యం తీసుకున్నా దాన్ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకోవ‌డం భాజ‌పాకి అల‌వాటే. వారి నిర్ణ‌యాల‌కు ప్ర‌జ‌లు హ‌ర్షిస్తే భాజ‌పా విజ‌యంగా చాటుకుంటారు. విమర్శించి, ఇదిగో ఇప్ప‌ట్లా నిర‌స‌న‌లు తెలిపితే… ఇది కాంగ్రెస్ చేస్తున్న ప‌ని అంటూ విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నారు. ఎంపీ జీవీఎల్ నర్సింహారావు హైద‌రాబాద్లో జరిగిన మేధావుల స‌మావేశంలో పాల్గొన్నారు. సీఏఏ గురించి మాట్లాడుతూ, మ‌ధ్య‌లో కాంగ్రెస్, ఆ మ‌ధ్య‌లో హైద‌రాబాద్లో మ‌త ‌రాజ‌కీయాలు అంటూ త‌న‌దైన ధోర‌ణిలో విశ్లేషించుకుంటూ పోయారు.

కాంగ్రెస్ మ‌త రాజ‌కీయాల‌కు హైద‌రాబాద్ అడ్డాగా మారింద‌ని జీవీఎల్ ఆరోపించారు! నిజ‌మైన సెక్యుల‌ర్ విధానాలు భాజ‌పాకి మాత్ర‌మే ఉన్నాయ‌న్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ సీఏఏ మీద నిర‌స‌న‌లు వ్య‌క్తం కావ‌డం లేద‌నీ, అంటే ఇత‌ర రాష్ట్రాల్లో వ్య‌క్త‌మౌతున్న నిర‌స‌న‌ల వెన‌క కాంగ్రెస్ ఉంద‌ని విశ్లేషించారు! సీఏఏ మీద త‌ప్పుడు రాజ‌కీయాలు కాంగ్రెస్ చేస్తోంద‌నీ, అందుకే ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు వివ‌రించాల‌నే వ‌చ్చామ‌న్నారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం వ‌ల్ల దేశానికి మ‌రోసారి స్వ‌తంత్రం వ‌చ్చిన‌ట్టు అయింద‌న్నారు. ఇదే కార్య‌క్ర‌మంలో లక్ష్మ‌ణ్ కూడా పాల్గొన్నారు. ఆయ‌నేమంటారంటే… అస‌దుద్దీన్ ఒవైసీతో జాతీయ గీతం పాడించిన ఘ‌న‌త ఒక్క న‌రేంద్ర మోడీకే ద‌క్కుతుంద‌న్నారు!

మ‌త రాజ‌కీయాల‌కు అడ్డాగా హైద‌రాబాద్ మారిందా? దాని వెన‌క కాంగ్రెస్ ప్రోత్సాహం ఉందా..? ఇలాంటి విమ‌ర్శ‌ల‌కు ఒక్క‌టైనా ఆధారాన్ని జీవీఎల్ చూపించి ఉంటే కొంతైనా న‌మ్మ‌శ‌క్యంగా ఉంటుంది. అయినా, సీఏఏ మీద ప్ర‌జ‌ల్లో అనుమానాలు నివృత్తి చేస్తామ‌ని భేటీ అయిన ఈ మేధావుల్లో ఒక‌రైన జీవీఎల్… క‌ల్పించిన అవ‌గాహ‌న ఏదీ? క‌శ్మీర్, ట్రిపుల్ త‌లాక్ లాంటిదే ఇది కూడా.. అని ప్ర‌జ‌లు న‌మ్మేలా చేసే విధంగా విశ్లేషణాత్మ‌కంగా మాట్లాడారా? సీఏఏ పేరుతో మత రాజ‌కీయాలంటూ కాంగ్రెస్ మీద విమ‌ర్శ‌ల‌కు ప‌రిమితం కావ‌డ‌మే ఈ అవగాహ‌నా స‌ద‌స్సు ముఖ్యోద్దేశమా? ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కి వ‌చ్చి, పోలీసు కాల్పుల్లో బ‌లైన ప‌రిస్థితి క‌నిపిస్తుంటే… ఆ నిర‌స‌న‌ల వెన‌కున్న అస‌లు కార‌ణం వ‌దిలేసి, ఇవి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవే, జ‌నాల్ని ఆ పార్టీయే పంపిస్తోందీ… ఇది కాదుగా మేధావులుగా జీవీఎల్ లాంటివాళ్లు చెయ్యాల్సిన విశ్లేష‌ణ‌? సీఏఏ ఎందుకు మంచిదో, ఎలా మంచిదో వివ‌రించండి. నిర‌స‌న‌లు ఆపే ప్ర‌య‌త్నం చెయ్యండి. క‌నీసం కొద్దిరోజుల‌పాటైనా రాజ‌కీయం ఆపండి. ఆ త‌రువాత‌, ఈ ఘ‌న‌త మాదే అని ఢంకా బ‌జాయించుకోవ‌చ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close