టాలీవుడ్‌పై హ‌న్సిక హాట్ కామెంట్స్‌

తెలుగు సినిమాపై ఇక్క‌డి ద‌ర్శ‌కుల‌పై యాపిల్ బుగ్గ‌ల సుంద‌రి హ‌న్సిక భ‌యంక‌రంగా అలిగింది. తెలుగు సినిమాలు త‌గ్గ‌డానికి ఇక్క‌డి ద‌ర్శ‌కుల ఆలోచ‌నే కార‌ణ‌మ‌ని, త‌న‌ని చిన్న‌చూపు చూస్తున్నార‌ని వాపోతోంది హ‌న్సిక‌. దేశ‌ముదురు త‌ర‌వాత హ‌న్సిక సుడి ఓ రేంజులో తిరిగింది. ఎంత స‌డ‌న్‌గా స్టార్ అయ్యిందో.. అంత స‌డ‌న్‌గా తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. తెలుగులో సినిమాలేం లేక‌పోయినా త‌మిళంలో మాత్రం హ‌న్సిక ఫుల్ బిజీ. అక్క‌డ ఇప్పుడు ఆమె చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. మ‌రి తెలుగులో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదేంట‌?? అంటే హ‌న్సిక బావురు మంటోంది.

”తెలుగులో నాకు ఎందుకు అవకాశాలు రావ‌డం లేదో నాకే అర్థం కావ‌డం లేదు. న‌న్ను స్టార్ ని చేసింది తెలుగు సినిమానే. కానీ.. ఇక్క‌డి ద‌ర్శ‌కులకు నేనిప్పుడు క‌నిపించ‌డం లేదు. అంత‌కు ముందు కాస్త బొద్దుగా ఉండేదాన్ని. ‘ఇంత లావుగా ఉంటే ఎలా’ అనేవారు. ఇప్పుడు స‌న్న‌బ‌డ్డా. ‘ఇంత స్లిమ్‌గా ఉంటే ఎలా. అప్పుడే బాగున్నారు’ అని రివ‌ర్స్‌లో మాట్లాడుతున్నారు. ఇంత‌కీ నేను తెలుగు ప్రేక్ష‌కుల‌కు స‌న్న‌గా క‌నిపించ‌డం అంటే ఇష్ట‌మా? లావుగా క‌నిపించాలా? ఈ విష‌యంలో ద‌ర్శ‌కుల‌కే క్లారిటీ లేదు” అంటోంది. హ‌న్సిక చెప్తోంది నిజ‌మే క‌దా?? ద‌ర్శ‌కులూ… ముందు ఆ విష‌యంలో కాస్త క్లారిటీ తెచ్చుకోండి. లేదంటే హ‌న్సిక మున్ముందూ ఇలానే అలుగుతుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close