ఈ హీరోకి 50 ఏళ్లంటే నమ్మేలా లేదు..!

హీరోలు తమ వయసు బయటపడకుండా జాగ్రత్త పడతారన్న సంగతి తెలిసిందే. కాని సంవత్సరానికి ఒకసారి వచ్చే తమ పుట్టినరోజు నాడు తమ వయసు గుర్తుచేసుకోక తప్పదు. తమిళ స్టార్ హీరో విక్రం ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే విక్రం వయసు తెలుసుకున్న వారు షాక్ అవుతున్నారు. ఈ సంవత్సరంతో విక్రం తన 49 సంవత్సరం నుండి 50 లోకి అడుగుపెట్టాడట.

విలక్షణ నటనతో ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న విక్రం ఇప్పటికి తాను యంగ్ హీరోలానే అనిపిస్తాడు. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు విక్రం. అయితే కొద్దికాలంగా ప్రయోగాలు చేస్తున్నా సరైన హిట్ కొట్టని విక్రం ప్రస్తుతం చేస్తున్న ‘ఇరు ముగన్’ సినిమాతో హిట్ గ్యారెంటీ అనేస్తున్నాడు. చియాన్ విక్రం పుట్టినరోజు సందర్భంగా కోలీవుడ్ లో ఆయన అభిమానులు వైభవంగా సంబరాలు జరుపుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]