ప‌వ‌న్ క‌థ‌… బ‌న్నీ కోసం

అల్లు అర్జున్ – హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. ఈచిత్రానికి దిల్‌రాజు నిర్మాత‌. హ‌రీష్ చెప్పిన క‌థ బ‌న్నీకి న‌చ్చ‌డం.. వెంట‌నే ప‌చ్చ‌జెండా ఊప‌డం.. ట‌క‌ట‌క జ‌రిగిపోయాయి. అయితే… ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. బ‌న్నీకి చెప్పిన క‌థ ప‌వ‌న్ కోసం రెడీ చేసుకొన్న‌ద‌ని టాక్‌. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర‌వాత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఓ సినిమా చేయాల‌ని హ‌రీష్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నించాడు. దిల్‌రాజు హ‌రీష్‌తో ఓ స్క్రిప్టు త‌యారు చేయించి.. ప‌వ‌న్ చుట్టూ తిరిగారు. అయితే ప‌వ‌న్ మాత్రం హ‌రీష్‌కి ఛాన్స్ ఇవ్వ‌లేదు.

ఇప్పుడు అదే క‌థ‌ని.. బ‌న్నీకి చెప్పి ఒప్పించుకొన్నాడు హ‌రీష్‌. బ‌న్నీ స్టైల్ వేరు.. ప‌వ‌న్ స్టైల్ వేరు. కాబ‌ట్టి బ‌న్నీకి తగ్గ‌ట్టు క‌థ‌లో చిన్న చిన్న మార్పులు చేశాడ‌ట‌. ఒక‌వేళ బ‌న్నీ సినిమా హిట్ట‌యితే.. ప‌వ‌న్ ఓ హిట్ సినిమాని కాల‌ద‌న్నుకొన్న‌ట్టే. మ‌రి ప‌వ‌న్ జ‌డ్జిమెంట్ క‌రెక్టా? బ‌న్నీది క‌రెక్టా? అనేది తెలియాలంటే ఈ సినిమా బ‌య‌ట‌కు రావాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close