అలా జరిగితేనే హరీష్‌కు మర్యాద!

తెలంగాణలో మరోసారి సెలబ్రేషన్‌ మూడ్‌లోకి వెళ్లడానికి తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు సిద్ధమవుతున్నారా? అంటే అవునని ఇప్పుకోవాల్సిందే. బుధవారం మెదక్‌జిల్లా సిద్దిపేట మునిసిపాలిటీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో వ్యక్తమవుతున్న జనాభిప్రాయానికి భిన్నంగా ఇక్కడ ఫలితాలు ఉంటాయని అనుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూలేదు. విజయబావుటా ఎగురవేసేసాంప్రదాయాన్ని తెరాస ఇక్కడ కూడా కొనసాగించబోతున్నది. అందులో సందేహం లేదు. సందేహమెల్లా… ఈ మునిసిపాలిటీలోనైనా ప్రతిపక్షాలకు ఏమైనా వార్డులు ఇస్తారా లేదా అచ్చంపేట ఫలితాలను రిపీట్‌ చేస్తారా? అనేది మాత్రమే. సిద్దిపేట ఎమ్మెల్యే, తెరాస సర్కారులో కీలక మంత్రి, కేసీఆర్‌ అల్లుడు హరీష్‌రావు మాత్రం.. సిద్దిపేటలో మొత్తం అన్ని వార్డులనూ తామే గెలుచుకుంటాం అని చాలా నమ్మకంగా చెబుతున్నారు. ప్రతిపక్షాలకు ఒక్క వార్డు కూడా దక్కదంటున్నారు. పార్టీ పరంగా సాగుతున్న చర్చల ప్రకారం.. అలాగే జరగాలి.. అలా జరిగితేనే హరీష్‌కు ఉన్న గౌరవం ఇనుమడిస్తుంది అని అంతా అనుకుంటున్నారు.
సిద్దిపేట అంటే తెరాసకు కంచుకోట. ఈ నియోజకవర్గంలో హరీష్‌రావు.. ఎప్పటికీ తనకు తిరుగులేని మంచి ఎమ్మెల్యేగా ప్రతిష్ట సంపాదించి మంచి స్థానానికి ఎదిగారు. సిద్దిపేటలో హరీష్‌ను ఎవ్వరూ ఓడించలేరనేంతగా ఆయన ప్రజలకు చేరువైన ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. సిద్దిపేటలో చాలాకాలం ముందునుంచి కూడా హరీష్‌కు ‘కాయిన్‌ బాక్స్‌ ఎమ్మెల్యే’ అని పేరు. సిద్దిపేట పరిధిలో కాయిన్‌బాక్స్‌నుంచి రూపాయి వేసి ఫోనుచేస్తే.. ఎమ్మెల్యే కచ్చితంగా పలుకుతాడని, సమస్య తీరుతుందని అక్కడి ప్రజల్లో ఆయన పట్ల ఉన్న నమ్మకం. చాలా శక్తిమంతమైన ఎమ్మెల్యేగా ఆయనకు పేరుంది.
అసలే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెరాస హవా బీభత్సంగా నడుస్తున్నది. ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఆ పార్టీనే విజయం సాధిస్తున్నది. ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లను ఎలా గెలిచారో అందరికీ తెలుసు. తెరాస బలహీనం అనుకునే పాలమూరు జిల్లాలో అచ్చంపేట మునిసిపాలిటీలో నూరుశాతం వార్డులు గులాబీ ఖాతాలోనే పడ్డాయి. మరి కేవలం పార్టీ హవానే అంత బీభత్సంగా ఉన్నప్పుడు.. దానికి హరీష్‌ రావు చరిష్మా తోడైతే విజయం ఎంత అత్యద్భుతంగా ఉండాలి? అందుకే ఆ విషయం మీదే ఇప్పుడు సిద్దిపేటలో చర్చలు జరుగుతున్నాయి.
అన్ని వార్డులు గెలుచుకోవడం మాత్రమే కాదు.. ఒక్క వార్డులో కూడా కూడా ప్రత్యర్థులకు డిపాజిట్లు రావని హరీష్‌రావు అంటున్నారు. అవును ఆయన చరిష్మా కు తగిన ఫలితం రావాలంటే.. అదే ఫలితాలు వెల్లడి కావాలి. అలా జరిగితేనే పార్టీలోనూ ఆయన గౌరవం పెరుగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close