హరీష్ రావు ఇంటికి వేలాదిగా అనుచరులు..! శుభాకాంక్షలు చెప్పడానికేనా..?

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను నియమించడంతో… ఆ పార్టీ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమయినట్లయింది. తనకు కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత కేటీఆర్.. వెంటనే హరీష్ రావును కలిశారు. ఆయన కూడా కలసి పని చేస్తామని ప్రకటించారు. కేటీఆర్ మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఆ తర్వా కార్యవర్గ సమావేశానికి కూడా హాజరయ్యారు. కానీ.. హఠాత్తుగా ఈ రోజు పెద్ద సంఖ్యలో హరీష్ అనుచరులు… మినిస్టర్ క్వార్టర్స్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఎంతగా వచ్చారంటే.. బంజారాహిల్స్ లో చాలా రోడ్లు హరీష్ ఇంటికి వచ్చిన అనుచరుల కార్లతోనే నిండిపోయాయి.

పార్టీలో మొదటి నుంచి కేసీఆర్ తో పాటు కష్టపడుతోంది హరీష్ రావేనన్న సానుభూతి ఉంది. ఈ క్రమంలో ఆయనకు అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో వారంతా వచ్చినట్లు తెలుస్తోంది. కానీ హరీష్ రావు ముఖ్య అనుచరులు మాత్రం.. ఈ విషయంలో మీడియా హడావుడి లేకుండా జాగ్రత్త పడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించినందుకు అభినందించడానికి వచ్చారని చెబుతున్నారు. తరలి వచ్చిన హరీష్ అనుచరుల కారణంగా మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ జామ్‌ అయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లో వ్యూహకర్తగా హరీష్‌ రావు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని ఓడించడంలో.. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో భారీ మెజార్టీతో గెలవడంలో కీలక పాత్రపోషించారు.

అభిమానులు భారీగా తరలి రావడంతో.. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన తొలి కార్యవర్గ సమావేశానికి హరీష్ రావు హాజరు కాలేకపోయారు. శుక్రవారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు. అయితే ఆ సమావేశంలో కేసీఆర్ ఉన్నారు. కానీ ఈ రోజు మాత్రం కేసీఆర్ లేరు. కేటీఆర్ మాత్రమే ఉన్నారు. అందుకే ఆయన హాజరు కాలేదా.. అన్న చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే టీఆర్ఎస్ వర్గాలు మాత్రం.. హరీష్ రావు అసలు అసంతృప్తిలో లేరని… ఆయన అనుచరులు శుభాకాంక్షలు చెప్పడానికే వచ్చారని .. ఘంటాపథంగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close