బ‌న్నీ ప‌చ్చ‌జెండా ఊపేసిన‌ట్టేనా?

స‌రైనోడు త‌ర‌వాత అల్లు అర్జున్ సినిమా ఇంత వ‌ర‌కూ ప‌ట్టాలెక్క‌లేదు. లింగు స్వామి, విక్ర‌మ్ కుమార్ ల‌పేర్లు వినిపించాయి. విక్ర‌మ్ కుమార్ కాస్త టైమ్ అడ‌గడంతో లింగు స్వామి ద‌ర్శ‌కుడిగా దాదాపుగా ఫైన‌ల్ అనుకొన్నారు. అయితే స‌డ‌న్ గా.. హ‌రీష్ శంక‌ర్ లైన్‌లోకి వ‌చ్చాడు. రామ‌య్యా వ‌స్తావ‌య్యా త‌ర‌వాత పెద్ద హీరోలు హ‌రీష్‌ని దాదాపుగా ప‌క్క‌న పెట్టేశారు. దాంతో కొంత విరామం తీసుకొని సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాని తీసి హిట్ కొట్టాడు. అయినా స‌రే.. స్టార్ హీరోలు హ‌రీష్‌తో ప‌నిచేయ‌డానికి ముందుకు రాలేదు. ఆమ‌ధ్య ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌ని తెగ ట్రై చేసిన హ‌రీష్‌.. ఆ త‌ర‌వాత బ‌న్నీ వెంట ప‌డ్డాడు.

గ‌త కొన్ని రోజులుగా బ‌న్నీతో ట్రావెల్ అవుతున్నాడు హ‌రీష్‌. బ‌న్నీకీ హ‌రీష్ తో ఓ సినిమా చేయాల‌నిపించింది.కాక‌పోతే లింగు స్వామికి ప్రామిస్ చేయ‌డం వ‌ల్ల హ‌రీష్ సినిమా విష‌యంలో డిసైడ్ కాలేక‌పోతున్నాడు. ఇప్పుడు లింగు స్వామి ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయిన‌ట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. లింగు స్వామితో సినిమా చేయ‌డం కంటే హ‌రీష్ తో లాగించేడ‌యం బెట‌ర్ అని బ‌న్నీ భావిస్తున్నాడ‌ట‌. ఒక్క‌సారి స్క్రిప్టు ఫైన‌ల్ నేరేష‌న్ విన్న త‌ర‌వాత‌.. డిసైడ్ అవుతా అని బ‌న్నీ… హ‌రీష్‌కి ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. దాంతో హ‌రీష్ శంక‌ర్ స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేసే ప్ర‌య‌త్నాల్లో ప‌డిన‌ట్టు టాక్‌. ఈవారంలోనే హ‌రీష్ క‌థ చెప్పేస్తాడ‌ని, ఒక‌వేళ అన్ని విధాలా ఒకే అంటే వెంట‌నే ఈసినిమాని ప‌ట్టాలెక్కించేస్తార‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close