షా, ఎన్టీఆర్ భేటీని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారా !?

బ్రహ్మస్త్ర అనే హిందీ సినిమా డబ్బింగ్ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సి ఉంది. ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. అయితే బందోబస్తు సరిపడా సిబ్బంది లేనందున పర్మిషన్ ఇవ్వబోమని పోలీసులు చెప్పారు. గతంలో ఇలాంటి ఈవెంట్లలో తొక్కిసలాటలు జరిగాయని వారి కారణం వారు చెప్పారు. అయితే వెంటనే.. మీడియా మొత్తం.. ఇటీవల అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిశారు కాబట్టే.. బ్రహ్మాస్త్ర ఈవెంట్‌కు పర్మిషన్ ఇవ్వలేదని.. రేటింగ్‌లు పడిపోయిన టీవీ చానల్ ప్రచారం చేస్తే.. దాన్ని ఇతర చానళ్లు అందుకున్నాయి. కనీసం ఆలోచించకుండా అదే కోణంలో ప్రచారం చేస్తున్నారు. నిజానికి బ్రహ్మస్త్ర సినిమాకు.. ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు.

ఈవెంట్‌కు పర్మిషన్ ఇవ్వకపోతే ఎన్టీఆర్‌కు పోయేదేం లేదు. ఈ విషయంలో ఎన్టీఆర్‌ను ఎందుకు టార్గెట్ చేస్తారు ?. అయితే ఏపీలో మాత్రం ఇలాంటి కక్ష సాధింపులు ఉంటాయి. చాలా సిల్లీగా .. ఇలా కూడా చేస్తారా అని అనుకునేలా అక్కడ కక్ష సాధింపులు ఉంటాయి. అందుకే అందరి మైండ్ సెట్ అలా ట్యూన్ అయిపోయినట్లుగా ఉంది. ఎన్టీఆర్ అమిత్ షాను కలిసినందునే.. ఇలా చేశారని ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో రాజకీయాలను చూడదు. ఎవరి పనులు వారిని చేసుకోనిస్తుంది. ఇంకా చెప్పాలంటే సినిమాతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నాగార్జున.. తెలంగాణ సర్కార్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.

ఆయన తల్చుకుంటే ఈవెంట్‌కు పర్మిషన్ వస్తుంది. కానీ అక్కడ అభ్యంతరం చెప్పింది పోలీసులు. ఎన్టీఆర్ కూడా అమిత్ షాను రాజకీయ కోణంలో కలిసి ఉండే చాన్స్ లేదు. అమిత్ షాకు రాజకీయ షా ఆలోచనలు ఉండవచ్చు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కేంద్ర మంత్రి పిలిచారు కాబట్టి తప్పక హాజరవ్వాల్సిన పరిస్థితి. ఇంత మాత్రానికే కక్ష సాధింపులకు పాల్పడతారని ఘనత వహించిన మీడియా ప్రచారంచేయడం ఆశ్చర్యకరం. కొసమెరుపేమిటంటే ఈ చానల్ నిన్నటి వరకూ రివర్స్‌లో వార్తలిచ్చేది.. ఇప్పుడు యాంటీ అయిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close