హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేసింది. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇంత కాలం మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ , డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్ ప్రకటన చేసిన వెంటనే భారీగా ముడిచమురు ధరలు పడిపోయాయంటే… ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య సాగుతున్న ప్రత్యక్ష యుద్ధం వల్ల ఇరు దేశాలు ఆర్థికంగా, సైనికంగా భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాయి. ఇప్పుడు వెనక్కి తగ్గినప్పటికీ.. ఈ యుద్ధం రెండు దేశాలూ ఘోరపరాజితులుగా మిగిలాయి. ల
అమెరికాకు తీవ్ర నష్టం
అమెరికా ఆధునిక యుద్ధ తంత్రంతో ఇరాన్ మౌలిక సదుపాయాలను దెబ్బతీసినప్పటికీ, ఇరాన్ తన హార్మూజ్ అస్త్రాన్ని ప్రయోగించి గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌ను స్తంభింపజేయగలిగింది. ఈ ప్రతిష్టంభన వల్ల ఎవరికీ విజయం దక్కకపోగా, కోలుకోలేని నష్టం వాటిల్లడంతో ఇరు పక్షాలు గౌరవప్రదంగా వెనక్కి తగ్గడానికి సిద్ధమయ్యాయి అసలు ఇజ్రాయెల్ వల్లే ట్రంప్ ఇలా చేశారు. ఆ ఇజ్రాయెల్ తన బద్ధ శత్రువులైన లెబనాన్ , ఇరాన్‌లపై మెరుపు దాడులు చేసింది. ముఖ్యంగా లెబనాన్‌లోని మిలిటెంట్ స్థావరాలను, ఇరాన్ అనుబంధ సంస్థలను ఇజ్రాయెల్ కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇజ్రాయెల్ లాభపడిందేమీ లేదు.
తగ్గిన ఆయిల్ మంటలు
హార్మూజ్ జలసంధి మూసివేతతో బ్యారెల్ ముడిచమురు ధర ఆకాశాన్ని తాకగా, తాజా ఓపెనింగ్ ప్రకటనతో మార్కెట్లు శాంతించాయి. ఇరాన్ ఈ జలసంధిని కేవలం ఒక టోల్ బూత్’లా వాడుకుని ఆదాయం పొందాలని చూసినా, అమెరికా విధించిన ఆంక్షలు , అంతర్జాతీయ ఒత్తిడి ముందు అది సాధ్యం కాలేదు. మరోవైపు, అమెరికా కూడా సుదీర్ఘ యుద్ధం వల్ల కలిగే ద్రవ్యోల్బణాన్ని భరించలేక, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడమే మేలని భావించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య జరిగిన పరోక్ష సంప్రదింపులే ఈ శాంతికి బాటలు వేశాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
వ్యూహాత్మక ముగింపు?
ప్రస్తుతానికి హార్మూజ్ జలసంధి తెరవబడినప్పటికీ, ఇది శాశ్వత శాంతా లేక తాత్కాలిక విరామమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమం , ఆంక్షల తొలగింపు విషయంలో అమెరికా నుండి గట్టి హామీ కోరుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అయితే మళ్లీ యుద్ధం చేసేందుకు ఏ దేశానికీ ఓపిక లేదు. అందుకే ఈ శాంతి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
