రాజ్ త‌రుణ్‌ని లాగొద్దు.. ప్లీజ్‌

రాజ్ త‌రుణ్ – హెబ్బా ప‌టేల్‌… ఈ జంట‌పై వ‌చ్చిన‌న్ని రూమ‌ర్లు ఈమ‌ధ్య మ‌రెవ్వ‌రిపైనా రాలేదేమో. కుమారి 21లో తొలిసారి జోడీ కొట్టారు వీరిద్ద‌రూ. ఆ త‌ర‌వాత ఈడోర‌కం ఆడోర‌కంలోనూ వీళ్ల కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇప్పుడు అంధ‌గాడుతో హ్యాట్రిక్ కొట్టేస్తున్నారు. వీళ్లిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ మేట‌ర్ ఓ రేంజులో న‌డుస్తోంద‌ని, అందుకే.. రాజ్ త‌రుణ్ హెబ్బాని ప్ర‌మోట్ చేస్తున్నాడ‌ని చెప్పుకొన్నారు. అంతేకాదు.. ఇద్ద‌రి మ‌ధ్యా ఏవో గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయ‌ని, అంధ‌గాడు సెట్లో ఎడ‌మొహం పెడ‌మొహంలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గాసిప్పుడు గుప్పుమంటున్నాయి. వీటిపై రాజ్ త‌రుణ్ ఒక్క‌సారి కూడా స్పందించలేదు. మాట్లాడినా `అవ‌న్నీ గాసిప్పులేనండీ` అంటూ ఒక్క ముక్క‌లో తేల్చేసేవాడు. ఇప్పుడు హెబ్బా ప‌టేల్ ఈ గాసిప్పుల‌పై మ‌న‌సు విప్పింది.

అయితే హెబ్బాదీ అదే మాట‌. రాజ్ త‌రుణ్ తో త‌న‌కు స్నేహం మాత్ర‌మే ఉంద‌ని, త‌మది హిట్ కాంబినేష‌న్ కాబ‌ట్టి ద‌ర్శ‌కులు రిపీట్ చేస్తున్నార‌ని అంత‌కు మించి ఏం లేద‌ని క్లారిటీగా చెప్పింది. తాను ల‌వ్‌లో ఉన్న మాట నిజ‌మే అని, ఆ ల‌వ్ రాజ్ త‌రుణ్‌తో కాద‌ని, అస‌లు సినిమాల‌కు సంబంధం లేని వ్య‌క్తిని ప్రేమించాన‌ని త‌న ల‌వ్ స్టోరీ గురించి క్లూ కూడా ఇచ్చింది. అయితే ఆ ల‌వ్ ఇప్పుడు బ్రేక్ అప్ అయ్యింద‌ట‌. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌ల వ‌ల్ల దూరంగా ఉంటున్నార్ట‌. త‌న జీవితంలో మ‌రోసారి ప్రేమ‌లో ప‌డే ఉద్దేశం లేద‌ని, అందుకే ఇక త‌న ల‌వ్ మేట‌ర్‌లో రాజ్ త‌రుణ్ పేరు అన‌వ‌స‌రంగా లొగొద్ద‌ని విన్న‌వించుకొంటుంది హెబ్బా. మ‌రి హెబ్బా ల‌వ్ పేరేంటో, ఎందుకు విడిపోయారో మాత్రం చెప్ప‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close