గౌత‌మిపుత్ర‌లో.. మ‌రో ఎట్రాక్ష‌న్‌

నంద‌మూరి బాల‌కృష్ణ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చాలా విష‌యాల్లో ప్ర‌త్యేక‌త సంత‌రించుకొంది. సంఖ్యాప‌రంగా బాల‌య్య‌కు ఇది వందో సినిమా. బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఈ చిత్రం కోసం స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేయ‌బోతున్నాడు. బాల‌య్య కెరీర్‌లో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. దాదాపు రూ.60 కోట్ల‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. యుద్ధ స‌న్నివేశాల్ని బాలీవుడ్ స్థాయిలో తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట క్రిష్‌. ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం బాలీవుడ్ న‌టి హేమా మాలినీ పేరు ప‌రిశీలిస్తున్నారు. ఆమె తెలుగు తెర‌పై క‌నిపించి ఐదారు ద‌శాబ్దాలైంది. ఇప్పుడు బాల‌య్య సినిమాలో మ‌రో సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్ చేర‌బోతోంది.

ఇందులో ఓ ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ న‌టుడు కబీర్ బేడి ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇది మ‌హారాజు పాత్ర అట‌. ఆ పాత్ర‌లో గాంభీర్యం ప్ర‌ద‌ర్శించే ఓ న‌టుడి కోసం చిత్ర‌బృందం గ‌త కొన్ని రోజులుగా అన్వేషిస్తోంది. క‌బీర్ బేడీ అయితే ఆ పాత్ర‌కి న్యాయం చేస్తార‌నిపించింద‌ట‌. వెంటనే భారీ పారితోషికం మ‌రీ ఆఫ‌ర్ చేసి క‌బీర్‌ని క‌న్‌ఫామ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈనెల 9 నుంచీ మొరాకోలో షూటింగ్ ప్రారంభం కానుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com