‘వాళ్లిద్దరూ’ కలిసి నేల నాకించేశారా?

‘నేల టికెట్ గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’ అని ‘నేల టికెట్టు’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సినిమాలో విలన్స్ ని ఉద్దేశించి హీరో అంటాడు దీనినొక గొప్ప డైలాగ్ లా ఫీలైపోయి.. ఈ డైలాగ్ తో ట్రైలర్ కూడా కట్ చేయించాడు దర్శకుడు.

‘నేల టికెట్టు’ సినిమా చూసే ఆడియన్స్ ఈ డైలాగ్ తమకు వరిస్తుందని ఫీలవుతున్నారనే విషయాన్ని పక్కన పెడితే.. హీరో డైరెక్ట్రర్ ఇద్దరూ కలిసి నిర్మాతతో ఆ పని చేయించారనే వ్యాఖ్యలు ఫిలిం నగర్ లో జోరుగా వినిపిస్తున్నాయి.

హీరో, డైరెక్టర్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్స్ తీసుకొని.. దాని ప్రభావం సినిమా బడ్జెట్ మీద పడనివ్వకుండా ఉండడం కోసం-హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ వంటి ముఖ్యమైన విషయాలతోపాటు మేకింగ్ పరంగానూ కాంప్రమైజ్ అయిపోవడం.. నేలబారు కథ కథనాలకు తోడై.. సినిమాను నేల నాకించేసిందని పలువురు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు.

సినిమాలపై ఎంతో ప్యాషన్ తో నిర్మాతగా మారిన ఎన్నారై రామ్ తాళ్ళూరికి వరసగా ఇది రెండో దెబ్బ. ఇంతకుముందు ఆయన వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా ‘చుట్టాలబ్బాయి’ అనే సినిమా తీశారు. ఆ సినిమాకి కూడా అవసరానికి మించి విపరీతంగా ఖర్చు పెట్టించేశారు. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రాలేదు. ఇప్పుడు తాజాగా ‘నేల టిక్కెట్టు’ సినిమాతోనూ ఆయనకు మరింత చేదు అనుభవం ఎదురు కావడం.. ఎన్నారై వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close