అజ్ఞాత‌వాసి… క్యాప్ష‌న్‌లోనే అంతా ఉంది!!

అజ్ఞాత వాసి ఫ‌స్ట్ లుక్ ఎంత ఆక‌ట్టుకొంటోదో.. ఈ టైటిల్‌కి ఇచ్చిన క్యాప్ష‌న్ అంత ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ‘ప్రిన్స్ ఇన్ ఎక్సిల్’ అనేది దీని క్యాప్ష‌న్‌. అది కాస్త గంభీరంగానే క‌నిపిస్తున్నా.. లోలోప‌ల చాలా అర్థం ఉంది. దేశ బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన రాజ‌కుమారుడు అని దీని అర్థం. ప‌ర‌దేశి, దేశ భ్ర‌ష్టుడు, దేశం నుంచి వెలివేసిన‌వాడు… అనే అర్థాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అజ్ఞాత‌వాసి అనే టైటిల్‌కి స‌రైన క్యాప్ష‌నే దొరికింది. నిజానికి ఈ టైటిల్ కంటే ముందు.. ప‌ర‌దేశి అనే పేరు అనుకొన్నారు. టైటిల్‌, క్యాప్ష‌న్‌ని బ‌ట్టి చూస్తే.. ఎక్క‌డి నుంచో ఇండియాకి వ‌చ్చి, ఇక్క‌డ‌.. కొన్ని ప‌నులు చ‌క్క బెట్టే క‌థానాయ‌కుడి పాత్ర‌లో ప‌వ‌న్ క‌నిపిస్తార‌న్న‌ది స్ప‌ష్టం అవుతుంది. కాకపోతే ఈ క్యాప్ష‌న్‌లోనే మ‌సాలా అద్దుకోవ‌డానికి కొంత మేట‌ర్ దొరుకుతోంది. ‘దేశ బ‌హిష్క‌ర‌ణ‌’ అనే ప‌దాన్ని ప‌ట్టుకొని నానార్థాలు తీయ‌డానికి చాలామంది ఈపాటికి సిద్ధ‌మ‌య్యే ఉంటారు. దేశం అంటే ‘తెలుగుదేశం’ అని క‌ల‌రింగు ఇచ్చినా ఇవ్వొచ్చు. ప‌వ‌న్‌కీ తెలుగు దేశానికీ చెడిపోయింద‌ని, అందుకే దాన్నిసూచిస్తూ ఈ క్యాప్ష‌న్ పెట్టార‌న్న గుస‌గుస‌లు వినిపించాయంటూ వార్త‌లొచ్చినా ఆశ్చ‌ర్యం లేదు. చూద్దాం.. గాసిప్ వీరులు ఎలాంటి వార్త‌ల్ని వండి వారుస్తారో..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close