“సోలార్” దోపిడికి అడ్డుకట్ట వేసిన హైకోర్టు..!

పదివేల మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్ కోసం ఏపీ సర్కార్ పిలిచిన టెండర్లను హైకోర్టు కొట్టి వేసింది. కేంద్రం నిబంధనలను పాటించకుండా ఇష్టారీతిన కొంత మందికి మేలు కలిగేలా టెండర్ నిబంధనలు రూపొందిచినట్లుగా టాటా సంస్థ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రభుత్వం తప్పు చేసినట్లుగా నిర్ధారించింది. టెండర్లను కొట్టి వేసింది. తాజాగా టెండర్లు పిలవాలని ఆదేశించింది., పవర్ ప్రాజెక్ట్ టెండర్లు కేంద్ర విద్యుత్ చట్టానికి విరుద్ధంగా ఉందని హైకోర్టు ప్రాథమికంగా నిర్ధారించింది.దీంతో ప్రభుత్వం ఈ టెండర్లలో ఏదో గూడుపుఠాణికి పాల్పడిందని తేలిపోయింది.

నిజానికి గత ప్రభుత్వం కొంత మరే సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌కు ప్రాధాన్యం ఇస్తే జగన్ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయగానే.. వేదిక మీద నుంచి ప్రసంగిస్తూ.. సంప్రదాయేతర విద్యుత్ రంగంలో చేసుకున్న ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. ఆరోపించారు. అందులో ఆయన చెప్పినవి.. పాతికేళ్ల పాటు పీపీఏలు చేసుకోవడం దగ్గర్నుంచి విద్యుత్ రేటు వరకూ చాలా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పదివేల మెగావాట్ల సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెండర్లు పిలిచారు.

కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది అవినీతి అన్నారో అంతకు మించి నిబంధనలు మార్చారు. పీపీఏలు 30 ఏళ్ల పాటు ఒప్పందం చేసుకుంటామంటూ ప్రభుత్వం అంగీకరించింది. గత ప్రభుత్వం పాతికేళ్ల పాటు ఒప్పందం చేసుకుంటనే అవినీతి అన్న వైసీపీ పెద్దలు 30 ఏళ్ల పాటు ఒప్పందం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. స్థిర చార్జీలతో పాటు.. ఒక వేళ ఏదైనా సమస్య వచ్చి విద్యుత్ ఉత్పాదన నిలిచిపోయినా… డబ్బులు కట్టేలా ఒప్పందం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో కన్నా ఎక్కువగా రాయితీలు ఇస్తామని టెండర్లలో పేర్కొన్నారు.

ప్రభుత్వం పిలిచిన సోలార్ టెండర్లలో కడపకు చెందిన ఓ కంపెనీకే అత్యధికం దక్కాయి. తర్వాత అదానీ పవర్ దక్కించుకుంది. దీని కోసం టెండర్ నిబంధనలు మార్చారు. చివరికి టాటా సంస్థ కోర్టుకెళ్లింది. దీంతో గతంలో చేసిన ఆరోపణల సంగతేమో కానీ.. అసలు దోపిడి మాత్రం బయటపడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close