ఇదే ఫైనల్ – బిల్లులు క్లియర్ చేయడానికి 4వారాల గడువిచ్చిన హైకోర్టు !

ఉపాధి బిల్లులపై చివరికి హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ కాలం సాగిన విచారణలో చివరికి చిరు కాంట్రాక్టర్లు విజయం సాధించారు. అయితే హైకోర్టు తీర్పును ఎంత వరకూ ప్రభుత్వం అమలు చేస్తుందనే దానిపై సందేహం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ఉపాధి హామీ పథకం బిల్లులపై 1013 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు బిల్లుల చెల్లింపులను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. 20 శాతం బిల్లులు తగ్గించి ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికే కొంత చెల్లించి ఉంటే మిగతా బకాయిలను 12 శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది.

దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు పరిష్కారం అయ్యాయి. 2018-19 సమయంలో ఉపాధి పనులు చేసిన వారికి.. వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. ఉపాధి హామీ పనులు చేసిన వారిలో అత్యధికం అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులే ఉన్నారు. ఈ కారణంగా వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. వారంతా న్యాయపోరాటం ప్రారంభించారు. ప్రభుత్వం దిగిపోయే నాటికి చేసిన పనులకు అధికారులు కొలతలు తీసి.. బిల్లులు కూడా సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో చెల్లింపులు నిలిపివేసింది. విజిలెన్స్‌ ఎంక్వైరీ పేరుతో బిల్లులు నిలిపివేశారు.

నిజానికి ఈ పనులకు నిధులు ఇచ్చేది కేంద్రం ప్రభుత్వం. లెక్క ప్రకారం కేంద్రం మంజూరు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పనుల్లో అక్రమాలు జరిగాయన్న కారణంగా చెల్లింపులు నిలిపివేసింది. ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లించుకుంది. అప్పట్నుంచి చెల్లింపులు చేయలేదు. ఇప్పుడు కోర్టు తీర్పుతో చెల్లింపులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close