కేటీఆర్ ఫామ్‌హౌస్‌ విషయంలో ఎన్జీటీ విచారణపై హైకోర్టు స్టే..!

జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఎటాక్‌ను ఎదుర్కోవడంపై… కేటీఆర్ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ గతంలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు చేసిన వాదనలకు.. ఎన్జీటీ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత చేస్తున్న వాదనలకు పొంతన లేకపోవడంతో.. రేవంత్ రెడ్డి వర్గం దీన్నో అడ్వాంటేజ్‌గా తీసుకుంది. తాజాగా… ఎన్డీటీ నోటీసులపై.. కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఎన్జీటీ
నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఫాంహౌస్‌ తనది కాదని హైకోర్టుకు నివేదించారు. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ..రాజకీయ కక్షపూరిత పిటిషన్ అని కేటీఆర్ వాదించడంతో.. హైకోర్టు ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.

అయితే.. ఫామ్‌హౌస్ తనది కానప్పుడు… కేటీఆర్ ఎందుకు అంత కంగారు పడుతున్నారన్న విమర్శలు రేవంత్ వర్గం నుంచి రావడానికి కేటీఆర్ అవకాశం కల్పించినట్లయింది. జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో ఎన్జీటీ నేరుగా కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. తనది కాదు అన్న విషయాన్ని ఎన్జీటీకే నోటీసులకు సమాధానం రూపంలో తెలియచేస్తే పనైపోయేది..కానీ… హైకోర్టులో సవాల్ చేశారు. జీవో 111కు విరుద్దంగా నగర శివార్లలో కేటీఆర్‌ ఫాంహౌస్‌ కట్టారని రేవంత్‌ రెడ్డి ఎన్టీటీకి ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ చెన్నై బెంచ్.. విచారణకు ఆదేశించింది. నోటీసులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, జీహెచ్ఎంసీ, వాటర్‌ వర్క్స్, హెచ్ఎండీఏ ప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌లతో కూడిన కమిటీ విచారించి కట్టడం అక్రమమైతే పర్యావరణ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, వసూలు చేయాల్సిన పరిహారం అంచనా వేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

అయితే కేటీఆర్ ఆ ఫామ్‌హౌస్ తనది కాదని వాదిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ నేతలు.. కేటీఆర్ ఆ ఫామ్‌హౌస్‌ను లీజుకు తీసుకున్నారనిచెప్పారు. ఇటీవల రేవంత్ కొన్ని డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. కేటీఆర్‌ది కాకపోతే.. ఎందుకు దాన్ని కూల్చడం లేదని సవాల్ చేశారు. దీంతో ఇదో రాజకీయ అంశమైపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close