హిందూపురం రివ్యూ : వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలే బాలకృష్ణకు ప్లస్ పాయింట్..!

నందమూరి బాలకృష్ణ.. ఎమ్మెల్యేగా రెండో సారి హిందూపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు పది వేలకుపైగానే మెజార్టీ వచ్చింది. ఈ సారి అంత కంటే ఎక్కువ వస్తుందన్న అంచనాలు.. టీడీపీ నేతలు వేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన 1983 నుంచి హిందూపురం నియోజవర్గంలో టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది. గట్టి పోటీ ఎదురయిన సందర్భాలు ఉన్నాయి కానీ.. ఓటమి చెందిన సందర్భం లేదు. ఇతర పార్టీ ఏదీ గెలుపు సాధించలేకపోయారు. ఈ సారి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో.. వైసీపీ.. అనేక ప్రయోగాలు చేసింది. ఏ ఒక్కటీ పూర్తిగా చేయలేదు.

బాలకృష్ణ పని తీరుపై ప్రజలు సంతృప్తి చెందారా..?

నందమూరి బాలకృష్ణ… ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో… ఆక్కడ ఉన్నది తక్కువ కాలమే. ఆయన పీఏలో..యాక్టింగ్ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తారు. అయితే.. అభివృద్ధి పనులు, ప్రజల సౌకర్యాల కల్పన విషయంలో మాత్రం బాలకృష్ణ ఎక్కడా రాజీపడలేదు. ప్రధానంగా హిందూపురం, లేపాక్షి మండలాలకు హంద్రీనీవా జలాలు తీసుకురావడం, రూ.194కోట్లతో పట్టణానికి తాగునీటిని తీసుకువచ్చి పట్టణ ప్రజల దాహార్తి తీర్చడం బాలకృష్ణకు ప్రజల్లో పలుకుడి పెంచింది. హిదంూపురం పట్టణంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. కొత్తగా మార్కెట్ నిర్మించి ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఎక్కువ మందికి అందేలా చూసుకున్నారు. మహిళలకు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయి. బాలకృష్ణ అందుబాటులో ఉన్నారా లేదా.. అన్న అంశంతో సంబంధం లేకుండా.. తమకు పనులు జరిగాయి కదా.. అన్న భావనలో ప్రజలు ఉన్నారు.

వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు…!

వైసీపీ తరపున బలిజ వర్గానికి చెందిన నవీన్ నిశ్చల్ ముఖ్యనేతగా ఉండేవారు. గత ఎన్నికల్లో ఆయనే పోటీ చేశారు. వరుసగా మూడు సార్లు ఓడిపోయారు. ఓ సారి టిక్కెట్ రాకపోవడంతో… స్వతంత్రంగా పోటీ చేసి మరీ రెండో స్థానంలో నిలిచారు. ఈ సారి పోటీ చేస్తే.. ఆయనకు సానుభూతి వస్తుందన్న ప్రచారం జరిగింది. బాలకృష్ణకు ఇబ్బంది అవుతుందని అనుకున్నారు. పైగా నవీన్ నిశ్చల్ కూడా.. హిందూపురంలోనే క్యాడర్ ను అంటి పెట్టుకుని ఉన్నారు. అయితే అనూహ్యంగా జగన్ ఆయనకు హ్యాండిచ్చారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీకి కండువా కప్పారు. ఆయనే అభ్యర్థిగా ఫిక్సయ్యారు. తర్వాత రెండు నెలలకే ఆయన చురుగ్గా లేరని.. మరో నేతను వెదికారు. చివరికి.. చంద్రబాబుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేసిన మాజీ ఐజీ ఇక్బాల్ ను రంగంలోకి దింపారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఇప్పుడు.. జగన్ సామాజికవర్గ నేతలు మినహా…ఇతరులు.. వైసీపీకి మద్దతివ్వలేని పరిస్థితి ఏర్పడింది. అబ్ధుల్ ఘనీ, నవీన్ నిశ్చల్ వర్గాలు.. ఇక్బాల్‌కు సహకరించే పరిస్థితి లేదు. పైగా ఇక్బాల్ .. కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి.

టీడీపీ అంతర్గత అసంతృప్తి కీలకమే..!

ఎమ్మెల్యేగా బాలకృష్ణ… అభివృద్ధి పట్టించుకున్నారు. కానీ పార్టీని పట్టించుకోలేదు. ఫలితంగా.. టీడీపీ నేతల్లో అనైక్యత ఏర్పడింది. కొంత మంది.. ఇతర పార్టీల వైపు చూశారు. చాలా మందిని ఎలాగోలా పార్టీలో ఉంచుకునేలాచేయగలిగారు. బాలకృష్ణ ఎమ్మెల్యే అయితే… పెత్తనం తమకు ఉంటుందని చాలా మంది ఆశించారు. కానీ.. పీఏల రాకతో పరిస్థితి మారిపోయింది. వారి అసంతృప్తి ఎంత తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తుందనేది.. కీలకంగా మారింది. హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పల్లెల్లోనే పట్టు ఉంది. హిందూపురం మున్సిపాలిటీ ఓటర్లు కంటే అధికంగా ఓటర్లు గ్రామీణం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,19,012 మంది ఉన్నారు. బాలకృష్ణ సతీసమేతంగా ప్రచారం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close