పెయిడ్ ఆర్టిస్టులు కాదు బాధితులే..! హోంమంత్రికి తెలిసిందోచ్..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల శిబిరం అంటూ.. టీడీపీ ఏర్పాటు చేసిన క్యాంప్‌పై… హోంమంత్రి స్థానంలో ఉన్న సుచరిత… తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆ శిబిరంలో ఉన్న వారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని… పదే పదే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. వారిని బాధితులుగా గుర్తించడానికి.. పూర్తి స్థాయిలో నిరాకరించారు. నిన్నటి వరకూ వారంతా పెయిడ్ ఆర్టిస్టులేనన్నారు. కానీ గురువారం మాత్రం.. వారిని బాధితులుగానే సంబోధించారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన హోంమంత్రి సుచరిత ఎక్కడా పెయిడ్ ఆర్టిస్టులనే పదం వాడలేదు. అందర్నీ బాధితులుగానే సంబోధించారు. అయితే.. టీడీపీతో పాటు.. వైసీపీలోనూ బాధితులున్నారని కవర్ చేసుకున్నారు.

వైసీపీ గెలిచిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తల దాడులకు భయపడి… ఊళ్లొదిలి వెళ్లిపోయిన వారి సమస్యను… అధికార పార్టీ మొదటి నుంచి తేలిగ్గా తీసుకుంది. పెయిడ్ ఆర్టిస్టులంటూ.. కించ పరిచే వ్యాఖ్యలు చేసింది. పార్టీ పరంగా… చాలా మంది అలాంటి విమర్శలు చేసినా.. తేలిపోయాయి. అయితే.. హోంమంత్రి హోదాలో ఉండి.. పార్టీలకు అతీతంగా… ఏపీ ప్రజలందరికీ.. రాజ్యాంగపరమైన హక్కులు పొందేలా చూడాల్సిన హోంమంత్రి కూడా… వారిని కించపరిచేలా మాట్లాడారు. వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే… పెయిడ్ ఆర్టిస్టులని ఎద్దేవా చేయడం ప్రారంభించారు. అంతే కాకుండా.. వైసీపీ నేతలు పోటీగా ఏర్పాటు చేసిన … శిబిరానికి వెళ్లి తీవ్ర విమర్శల పాలయ్యారు.

హోంమంత్రి పెయిడ్ ఆర్టిస్టులన్న వారినే పోలీసులు… ఐదు బస్సుల్లో.. వారి వారి గ్రామాలకు తీసుకెళ్లారు. వారిపై ఎవరెవరు దాడులకు పాల్పడ్డారో.. వారి వివరాలు తీసుకున్నారు. అలాంటివారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి దాడులు జరగకుండా… చూసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు తీసుకెళ్లిన వారిలో ఒక్కరంటే.. ఒక్కరు కూడా బాధితులు కాని వారు లేరు. అందరూ… వైసీపీ కార్యకర్తల దాడులకు భయపడి.. ఊళ్లొదిన వాళ్లే. గ్రామాలకు సంబంధం లేని వారు ఒక్కరు ఉన్నా… ఆ విషయాన్ని వైసీపీ నేతలు చిలువలు పలువలుగా చెప్పేవారు. కానీ ఒక్కరు కూడా… అలాంటి వారు లేరు. ఈ విషయంలో హోంమంత్రికి రిమార్కులు పడినట్లేనన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close