అలా ముగిసిన లాండ్ డీల్ నాకేంతెలుసు : నారాయణ!

రాజధాని అమరావతి ప్రాంతంలో ‘అసైన్డ్’ భూములు పొజిషన్ లో వున్నవారికి పరిహారం ఇవ్వాలా వద్దా అనే విషయం అధికారులతో ఆలోచించాకే నిర్ణయం తీసుకోగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పరిహారం ఇచ్చే పక్షంలో సుదీర్ఘ కాలం ఆ భూములను సాగుచేసుకుంటున్నవారికి అందజేస్తారా? లేక గత జూలై ఆగస్టు నెలల్లో వందల ఎకరాల అసైన్డ్ భూమి కొసేసిన ‘కొత్త యజమానులకు’ పరిహారం ఇస్తారా అన్నది పెద్ద ప్రశ్న!

బడుగు బలహీన వర్గాల వారికి అసైన్ చేసిన ప్రభుత్వ భూములను వారు అనుభవించడానికే తప్ప అమ్ముకోడానికి వీలులేదు. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం అసైన్డ్ భూములు పలుకుబడిగల వారి ఆధీనంలోనే వున్నాయి. భూముల కేటాయింపు పొందిన బలహీన వర్గాల వారికి డబ్బు ఇచ్చి ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. ముప్పై ఏళ్ళుగా ఇవి ఎవరి ఆధీనంలో వున్నాయో జరిమానాలు కట్టించుకుని వారి పేరిటే భూములు క్రమబద్ధం చేసే ప్రతిపాదనలు వున్నాయి.

ఇలా వుండగా అమరావతి ప్రాంతంలో సారవంతమైన అసైన్డ్ లాండును పొందిన బలహీనవర్గాల వారు ఎవరికీ అమ్ముకోలేదు. లాండ్ పూలింగులో ప్రభుత్వం భూమి స్వాధీనం చేనుకున్నాక అసైన్డ్ భూములను కూడా ప్రభుత్వం తీసేసుకుంటుందని, చట్ట ప్రకారం వీటికి పరిహారం ఇవ్వనవసరంలేదు గనుక, ప్రభుత్వం వద్ద నిధులు కూడా లేవు గనుక ఇస్తే తీసుకోవడం లేకపోతే ఊరుకోవడం మినహా గత్యంతరం లేదని అధికారులు చెప్పారు. దీంతో అసైన్డ్ భూమిదారులు భూములను తెగనమ్ముకున్నారు. రెండు వారాల్లోనే ఈ విధంగా దాదాపు 4 వేల ఎకరాల అమ్మకాలు జరిగాయి. ఇవన్నీ చిన్నచిన్న కమతాలే!

క్రయవిక్రయాలు చెల్లుతాయో చెల్లని పరిస్ధితుల్లో రైతులు వచ్చిందే చాలన్నట్టు తక్కువ ధరకు అమ్ముకున్నారు. కొనుగోలు దారును కూడా పెద్దగా బేరమాడకుండా మంచి ధర ఇచ్చారన్న అభిప్రాయం కలిగించారు. చిన్నచిన్న విస్తీర్ణాల్లో వున్న భూములను చీమలమందల్లో వచ్చి రెండువారాల్లో కొనుక్కుపోయిన వారెవరు? అసలు వారికి అసైన్డ్ భూముల సమాచారం ఇచ్చినవారెవరు అన్నది అప్పట్లో సమాధానం లేని ప్రశ్న! అలా డీల్ ముగిసిపోయింది.

“నా సంస్ధల్లో సిబ్బంది ఎవరెవరు ఎక్కడెక్కడ భూములుకొన్నారో తెలుసుకోవడం నా పని కాదు” అన్న మున్సిపల్ మంత్రి నారాయణ తాజా సమాధానంలో అప్పుడు అసైన్డ్ భూములు ఎవరుకొన్నారన్నదానికి కూడా సమాధానం వచ్చేసింది. ఉపముఖ్యమంత్రి కూడా అయిన రెవిన్యూమంత్రి కెయి కృష్ణమూర్తి ” నేను రెవిన్యూ మంత్రిని అయినా కూడా అమరావతిలో ఏంజరుగుతుందో నాకు తెలియదు.. మంత్రి నారాయణే అన్నీ చూసుకుంటున్నారు” అని అప్పట్లోనే వ్యాఖ్యానించారు.

ఎసైన్డ్ భూముల డీల్ ఇలా ముగిస్తే రైతుల పట్టాభూములను కనీసం 15 మంతి తెలుగుదేశం ముఖ్యులు కారు చౌకగా కొనేశారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వున్నపుడు నిధులు సమీకరించి ఆదుకున్న సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు, మురళీమోహన్, పత్తిపాటి పుల్లారావు మొదలైన వారు అమరావతిలో భూములుకొనేసి లాభపడ్డారన్నది ఆరోపణ.

అమరావతిలో భూముల కొనుగోలు చట్టవిరుద్ధం కాకపోవచ్చు…సమాచారాన్ని దగ్గరుంచుకుని దాన్ని స్వార్ధానికి వాడుకోకూడదన్న నీతికి సంబంధించిన అంశం. కంచె చేను మేయకూడదన్న ధర్మానికి సంబంధించిన ప్రశ్న! “ఇపుడు ఏంజరిగిందని విచారణ…నీ దగ్గర డబ్బుంటే నువ్వు భూమి కొనుక్కుంటావు..అంతా నిబంధనల ప్రకారమే జరిగిందా లేదా అన్నదే నాకు ముఖ్యం” అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానమే …రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అమరావతి “భూకంపం” నుంచి ప్రభుత్వం ఎలా తప్పించుకోబోతోందో బయటపెట్టేసింది.

అమరావతికి భూసమీకరణ, సేకరణ కూడా అయిపోయిన తర్వాత పేదల భూములన్నీ నాయకుల బినామీల చేతిలోకి వచ్చేసిన తర్వాత పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తామని ప్రకటిస్తూ జీవో నెం 41 జారీ చేయడం మరో ఎత్తు. బినామీలతో కొనుగోళ్ళు చేయించిన భూముల్ని క్రమబద్ధం చేయించడమే ఈ జిఓ వెనుక వున్న ఉద్దేశం. విషయం రోడ్డున పడ్డాక ”పరిహారం విషయం అధికారులతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని” ముఖ్యమంత్రి పునరాలోచనలో పడ్డారు.

ఈ వ్యవహారంవల్ల రాజకీయ సంక్షోభమేదీ వుండదు. ఏ ఒక్కరి పదవీ ఊడదు కూడా! అయితే తెలుగుదేశం పార్టీ మోయవలసి అప్రతిష్ట, రాష్ట్రప్రభుత్వం ముఖ్యంగా కేంద్రప్రభుత్వం ముందు తలవంచుకోవలసిన చిన్నతనం తక్కువేమీ కావు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close