చైతన్య : దొందూ..దొందే..! ఎవరు అధికారంలో ఉంటే వారు దిగజారిపోతారు..!

గత ఏడాది కర్ణాటక అయినా.. ఈ సారి మహారాష్ట్ర అయినా.. భారతీయ జనతా పార్టీ.. చేసిన రాజకీయాలు.. ప్రజలను విస్మయానికి గురి చేశాయి. కాంగ్రెస్ పార్టీ లాంటిది కాదు.. బీజేపీ అని అనుకునేవారి కళ్ల ముందున్న అమాయక పొరలను చెరిపేశారు. రెండూ.. పార్టీలు సేమ్ టు సేమ్ అని నిరూపించారు. ఒకప్పుడు.. ఒక్క పార్లమెంట్ సభ్యుడ్ని ఆకర్షిస్తే.. ప్రభుత్వాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఉండి కూడా.. వాజ్‌పేయి ఆ పని చేయలేదు. అప్పుడు బీజేపీకి వాజ్‌పేయి తెచ్చిన ఇమేజ్ ఇప్పుడు.. కనుమరుగైపోయింది.

కర్ణాటకలో బలం లేకపోయినా గవర్నర్ ద్వారా రాజకీయం..!

2018 కర్ణాటక ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ రాలేదు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 222 స్థానాలు ఉన్న అసెంబ్లీలో బీజేపీకి 104 స్థానాలు వచ్చాయి. ఫలితాలు వచ్చిన వెంటనే.. కాంగ్రెస్ – జేడీఎస్ జట్టు కట్టేశాయి. వారికి కళ్ల ముందు మెజార్టీ కనిపిస్తోంది. కానీ.. కేంద్రం అక్కడే గేమ్ ఆడింది. అతిపెద్ద పార్టీ కావడంతో యడియూరప్పను గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. బలనిరూపణకు గవర్నర్‌ 15 రోజుల సమయం ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్‌, జేడీఎస్‌లు సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో… మే 19 2019నే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. అంతే అక్కడితో సీన్‌ మారిపోయింది. బలపరీక్షలో విజయం తమదే అని చెబుతూ వచ్చిన బీజేపీ.. చివరికి చేతులెత్తేసింది. ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపి ఆడియో టేపులతో దొరికిపోయింది. పరువు పోగొట్టుకుని ప్రభుత్వాన్ని వదులుకుంది.

మహారాష్ట్రలోనూ అదే రాజకీయం..!

మహారాష్ట్రలో ఇప్పుడు కూడా అదే జరిగింది. అజిత్‌ పవార్‌ సాయంతో అధికారం దక్కించుకున్న బీజేపీకి అంతా ఆల్‌ ఈజ్‌ వెల్‌ అనుకుంది. ఇక్కడ కూడా బలనిరూపణకు గవర్నర్‌ అధిక సమయం కేటాయించారు. అయితే అర్థరాత్రి ప్రమాణస్వీకారాలపై శివసేన కోర్టును ఆశ్రయించింది. దీనిపై చర్చించిన సుప్రీంకోర్టు కర్ణాటకలో జరిగినట్లే.. ఇక్కడ 24 గంటల్లో బలపరీక్ష నిర్వహించాలంటూ ఆదేశించింది. దాంతో సీన్‌ మొత్తం మారిపోయింది. బీజేపీపై ఒత్తిడి పెరిగింది. సంఖ్యా బలం లేదని గుర్తించిన బీజేపీ పెద్దలు రాజీనామా చేయాలని ఫడ్నవీస్‌కు సూచించారు. దీంతో కర్ణాటక లాగా.. సభ ముందుకు వెళ్లకుండానే ఫడ్నవీస్‌ తప్పుకున్నారు.

రాజ్యాంగ విలువల పతనంలో బీజేపీది ఇప్పుడు ప్రముఖ పాత్ర..!

ఇలా రెండు సందర్భాల్లోనూ సేమ్‌ సీన్లు కనిపించాయి. కానీ అనూహ్యంగా రాజకీయం మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత.. ఎమ్మెల్యేల తమ వెంట వస్తారని భావించినా రెండు సందర్భాల్లోనూ ఎదురుదెబ్బలు తగిలాయి. రాజ్యాంగాన్ని పరిహసించి.. గవర్నర్ అధికారాలను దుర్వినియోగం చేసి.. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేయడం..మార్చేయడం వంటి పరిణామాలతో.. దేశం మొత్తం ఓ దుర్భరమైన రాజకీయ వ్యవస్థ దిశగా మారుతోంది. దానిలో బీజేపీ.. కీలక కారణంగా అవతరిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close