అపోహలు కాదు.. తప్పులే..! మరి విద్యార్థులకు న్యాయం ఎలా…?

ఇంటర్ విద్యార్థులను.. అటు ఇంటర్ బోర్డు.. ఇటు గ్లోబరీనా సంస్థ కలిపి ముంచేశాయని.. స్పష్టమయింది. ప్రభుత్వం నియమించిన కమిటీ… మూడు రోజులలో మూలాలను కూడా… కనిపెట్టి… నివేదిక ఇచ్చింది. కొంత ఒత్తిడితో.. గ్లోబరీనాకు చెందిన కీలకమైన విషయాలను నివేదిక నుంచి తొలగించారని ప్రచారం జరిగినప్పటికీ.. నివేదికలో మాత్రం కీలకమైన విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది… ఫలితాల్లో తప్పులు దొర్లడం. కొంత మంది చెబుతూ వచ్చినట్లుగా.. అది అపోహ కాదు… నిజంగానే తప్పులు దొర్లాయని నిర్ధారించడం. దాన్ని విద్యాశాఖ కూడా ధృవీకరించడంతో… విషయంపై క్లారిటీ వచ్చింది.

ఫెయిలైనవారి జవాబు పత్రాల రీవాల్యుయేషన్‌ చేస్తారు. అన్ని సబ్జెక్టులలో గరిష్ఠ ఉత్తీర్ణతతో పాసై, ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలైనవారి… జవాబుపత్రాలను రీవాల్యుయేషన్‌ కూడా చేస్తారు. కమిటీ సిఫార్సు కూడా ఇదే. కోడింగ్‌, డీకోడింగ్‌ పొరపాట్లతో… ఉత్తీర్ణులైనవారు ఫెయిలైనట్టుగా… ఫెయిలైనవారు ఉత్తీర్ణులైనట్టుగా మెమోలు రావడాన్ని కమిటీ తప్పు పట్టింది. గ్లోబరీనా సాఫ్ట్‌వేర్‌లో తొలినుంచి సమస్యలున్నాయని లోపాలు గుర్తించేందుకు సిబ్బందిని నియమించుకోలేదని కమిటీ చెప్పింది. హాల్‌ టికెట్ల జారీ నుంచి ఫలితాల వరకు… ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ఇస్తే బాగుండేదని కమిటీ చెప్పింది. నివేదికలోని అంశాలను… విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి చెప్పి… త్వరలోనే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. ఇదే జనార్ధన్ రెడ్డి.. అపోహలని మొదట్లో వాదించే ప్రయత్నం చేశారు.

ఫలితాల్లో తేడాలతో… 23మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారు. వారిలో.. ఏ ఒక్కరైనా.. నిజంగా పాస్ అయి… ఇంటర్ బోర్డు, గ్లోబరీనా నిర్లక్ష్యం వల్ల… ఆత్మహత్య చేసుకుని ఉంటే … ఎలా న్యాయం చేస్తారు..?. ప్రాణాలు తెచ్చిస్తారా..? వీరే కాదు..వేల సంఖ్యలో తప్పులు దొర్లాయని… త్రిసభ్య కమిటీ నివేదించింది. అంత మందికి మానసిక క్షోభకు గురి చేసి.. అసలు వ్యవస్థ మీదే నమ్మకం లేకుండా చేసిన వారికి.. ఎలాంటి శిక్ష విధిస్తారు..? అసలు పరీక్షలకు హాజరు కాకపోయినా… అబ్సెంట్ పాస్ ఇచ్చిన ఘనతకు.. ఎంత పెద్ద సన్మానం చేయాలి..? . నిలువెత్తు నిర్లక్ష్యంతో … విద్యార్థుల జీవితాల్లో ఆడుకున్నది మాత్రం నిజం. దీనికి అసలు కారకులు మాత్రం.. హాయిగానే ఉంటారు. విద్యార్థులు మాత్రమే శిక్ష అనుభవించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close