ఒంటి చేత్తో లోక్‌సభ సమరం..! తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… అంచెలంచెలుగా తన రాజకీయ ప్రజ్ఞాపాటవాల్ని అసువుగా ప్రదర్శిస్తున్నారు. ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ నేతలందర్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. తెలంగాణ రాజకీయాల్లో… తనదైన ముద్ర వేస్తున్నారు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చినా ఇప్పుడు తండ్రిని మరిపిస్తున్నారు. ఒంటి చేత్లో ఎన్నికలన్నీ… ఏకపక్షంగా జరిగేలా వ్యుహాలు పన్నుతున్నారు.

జెండా – ఎజెండా సెట్ చేసేది కేటీఆరే..!

ఢిల్లీలోని శాసించాలంటే.. పదహారు సీట్లివ్వాలె..! అంటూ… ప్రజలకు స్పష్టమైన ఎజెండాను.. నిర్దేశించడంతో.. కేటీఆర్ శైలి భిన్నం. ఈ ఎన్నికల్లో తమకు ఏం కావాలో..ఎందుకివ్వాలో ప్రజలకు స్పష్టంగా విడమర్చి చెప్పడంతో.. ఆయనకు ఆయనే సాటి. లోక్‌సభ ఎన్నికల బాధ్యతను కేసీఆర్ తన మీద పెట్టిన తర్వాత ఆయన క్షణం కూడా వృధా చేయలేదు. ముందుగా ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. రోజుకు రెండు, మూడు.. చొప్పున.. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ.. ఎన్నికల సన్నాహ సభలను పూర్తి చేశారు. అందులో… పార్లమెంట్ ఎన్నికలు ఎంత కీలకమో.. ప్రజలకు అర్థమైన పదాలతో చెప్పారు. ఇవి లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. టీఆర్ఎస్‌కు ఏం సంబంధం అని.. అంటున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ధీటైన సమాధానం ఇచ్చారు. ప్రజలకు పదహారు సీట్లివ్వాలని… అప్పుడే దేశంలో తెలంగాణ గర్వంగా తలెత్తుకుంటుందని చెబుతున్నారు.

తండ్రిని మించిన మాటల చాతుర్యం..!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచి వక్త. ప్రజల్లో ఎలాంటి భావోద్వాలను అయినా… తనకు అనుగుణంగా మార్చుని.. అందుకు తగ్గ భాషను ప్రయోగించడంలో దిట్ట. కేటీఆర్ కూడా.. ఈ విషయంలో ఏ మాత్రం తగ్గరు. ఆయన చదువు ఎక్కువగా.. తెలంగాణలో చదవకపోయినా… తెలంగాణ సాధారణ ప్రజల భాషను మాత్రం.. వంట బట్టించుకున్నారు. రాజకీయ ప్రసంగాలు మొత్తం.. తెలంగాణ సామాన్య ప్రజలు ఎలా మాట్లాడుకుంటారో.. అలానే కొనసాగిస్తారు. ఢిల్లీని శాసించాలని చెప్పినా… కర్ర ఉన్నోడితే బర్రె అన్నా… ఆది ప్రజల మనసుల్లోకి సూటిగా వెళ్లేలా చెప్పడమే. ఈ విషయంలో.. కేసీఆర్ తర్వాత.. ఆ ప్లస్ పాయింట్ కేటీఆర్‌కే ఉంది. తెలంగాణలోని మరో నేతకు.. ఇలాంటి వాక్పటిమ లేదు.

రాజకీయ వ్యూహాల్లోనే రాటుదేలిన కేటీఆర్..!

ఎప్పుడు వచ్చారన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా.. అన్నది ముఖ్యం. కేటీఆర్ కూడా ఇచ్చంగా ఇదే ఫాలో అవుతున్నారు. ఆయన రాజకీయాల్లోకి ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు కానీ… టీఆర్ఎస్‌లో ఆయన స్పీడ్‌ను ఎవరూ అందుకోలేకపోయారు. సిరిసిల్లలో మొదటి సారి 150 ఓట్ల తేడాతో గెలిచిన కేటీఆర్ మెజార్టీ ఇప్పుడు.. ఇంచు మించు లక్ష. అంతగా ప్రజాభిమానం పొందడం మాత్రమే… కాదు… రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో… తన తర్వాత ఎవరైనా అని నిరూపిస్తున్నారు. పార్టీలో వరుసగా చేరుతున్న ఎమ్మెల్యేలు… ముందుగా వెళ్లి కేటీఆర్‌నే కలుస్తున్నారు. అంటే.. అసలు వ్యూహం అంతా.. కేటీఆర్‌దేనని ఇట్టే తెలిసిపోతుది. కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం ద్వారా.. తెలంగాణ రాజకీయ చిత్రపటంలో.. టీఆర్ఎస్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టే లక్ష్యంతో కేటీఆర్ పయనిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీతో ప్రారంభం…లోక్‌సభతో సిక్సర్..!

పార్టీలో ఎన్నికల గెలుపు బాధ్యతను కేటీఆర్ మొట్టమొదటగా… గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తీసుకున్నారు. అంతకు ముందు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేకపోయింది. క్యాడర్ లేకపోవడం… నగరం అంతా… టీఆర్ఎస్ కు వ్యతిరేకమని ప్రచారం జరగడమే దీనికికారణం. ఇలాంటి పరిస్థితిని చాలెంజ్‌గా తీసుకున్న కేటీఆర్ రంగంలోకి దిగారు. 150 డివిజన్లలో వంద డివిజన్లను గెలుస్తామని చాలెంజ్ చేశారు. పక్కా వ్యూహంతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 99 స్థానాల్లో విజయం సాధించారు. అక్కడ్నుంచి కేటీఆర్ జైత్రయాత్ర మొదలైంది. ఏది పట్టినా బంగారం అయింది. ఇప్పుడు.. లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. 16 లోక్‌సభ స్థానాలు సులువుగా విజయం సాధించడం ఖాయమని తేలిపోతోంది. దటీజ్ కేటీఆర్..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close