ఏపీలో “మాఫియా” లాక్కున్న కంపెనీలు ఎన్ని !?

ఏపీలో అమ్ముతున్న విచిత్రమైన మద్యం బ్రాండ్ల ప్రస్తావన వచ్చినప్పుడు అవి తయారు చేస్తోంది టీడీపీ నేతల డిస్టిలరీలే అని ప్రచారం చేశారు. నిజానికి అంతకు ముందు అయ్యన్నపాత్రుడు వంటి వారికి డిస్టిలరీ ఉంది. వైసీపీ రాగానే అది వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది. తాజాగా అగ్రవాదులకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన సేఫ్ ఫార్మా .. వైసీపీ ప్రభుత్వం వచ్చేదాకా టీడీపీ నేత కోడెల కుటుంబసభ్యుల చేతుల్లో ఉంది. ఇప్పుడు అది వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక గనులు.. ఇతర వాటి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆస్తులనే పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి లాక్కుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా వరుసగా టీడీపీ నేతల కంపెనీలే చేతులు మారిపోయాయంటే… ఇక సామాన్యులు ఎంత మంది బాధితులుగా మారిపోయి ఉంటారనేది ఊహకు అందని అంశంగా మారింది.

ఏపీలో కంపెనీలు లాక్కునే మాఫియా చెలరేగిపోయిందా ?

వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏపీ నుంచి చాలా కంపెనీలు వెళ్లిపోయాయి. వస్తామన్న కంపెనీలు వెళ్లిపోయాయి. వెళ్లలేకపోయిన కంపెనీలు చేతులు మారిపోయాయి. ఇలా కొన్ని వందల కంపెనీల యాజమాన్యంలో మార్పులు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ నేతల వ్యాపారాలపై దృష్టి పెట్టి వాటిని లాగేసుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయ్యన్న డిస్టిలరీ, కోడెల సేఫ్ ఫార్మాల గురించి బయటకు తెలిసింది కాబట్టి సరే.. మరి తెేలియని వాటి సంగతేమిటన్నది బయటపడాల్సి ఉంది.

నాలుగేళ్లుగా ఏపీలో చేతులు మారిన కంపెనీల లెక్క తీస్తే అసలు గుట్టు రట్టు !

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేతులు మారిన కంపెనీలు ఎన్ని.. అవి ఎవరి చేతుల్లోకి వెళ్లాయి.. ఎలాంటి లావాదేవీలు జరిగాయన్న దానిపై లెక్కలు బయటకు తీస్తే మొత్తం మాఫియా వ్యవహారం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా రికార్డెడ్ గా ఉండే వ్యవహారామే. ముందు తెర పై జరిగిన వాటిని వెలుగులోకి తెస్తే తెర వెనుక ఏం జరిగిందనేది మొత్తంగా బయట పెట్టవచ్చు. అయితే ఈ మాఫియా ప్రభుత్వ పెద్దల అండదండలతోనే చెలరేగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఎలాంటి వివరాలూ బయటపెట్టదు. చర్యలు తీసుకోదు. ప్రభుత్వం మారాల్సిందే.

ప్రజల ఆస్తులనూ లాక్కుంటున్నారని తీవ్ర ఆరోపణలు !

ఏపీలో ఇప్పటికే పోలీసులు నిర్వీర్యం అయిపోయారు. వారికి సమాంతరంగా మరో నేర వ్యవస్థ నడుస్తోంది. ప్రశ్నించే వారిపై .. రాజకీయ ప్రత్యర్థులపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారు కానీ.. అసలైన నేరస్తులు మాత్రం విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇలాంటి మాఫియా ప్రైవేటు ఆస్తులను సైతం ఇష్టారితీన రాయించుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. భయంతో బాధితులు ఎవరూ బయటకు రావడం లేదు. ఇంత అరాచకానికి ముగింపు పలకాలన్న ఆవేదన మాత్రం బాధితుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close