ఆ సినిమాకి ఎంత మంది ద‌ర్శ‌కులో?

ఓ యువ హీరోతో ఓ సినిమా మొద‌లైంది. ఓ అమ్మాయికి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ సినిమాకి ముందు నుంచీ ఎన్నో ఆటు పోట్లు. స్క్రిప్టు రెడీ అయినా, ఆ అమ్మాయిపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతో ప‌ట్టాలెక్క‌లేదు. కానీ నిర్మాత నుంచి ద‌ర్శ‌కురాలికి మంచి స‌పోర్ట్ దొరికింది. ఆయ‌న గ‌ట్టిగా రిక‌మెండ్ చేయ‌డంతో.. సినిమా మొద‌లైంది. కొన్ని రోజులు షూటింగ్ స‌వ్యంగానే సాగింది. కానీ.. ర‌షెష్ చూసుకున్నాక ఆపేశారు. చెప్పిందొక‌టి, రాసిందొక‌టి, తీసిందొక‌టి.. అన్న‌ట్టు త‌యారైంది వ్య‌వ‌హారం. కానీ.. నిర్మాత వ‌ద‌ల్లేదు. ఏదోలా స‌ర్ది చెప్పి సినిమా మళ్లీ మొద‌లెట్టారు. రీషూట్లు జ‌రిగాయి. సెట్లో ఒక్కోసారి కెమెరామెన్‌, ఒక్కోసారి హీరో, వీరెవ‌రూ కాదంటే నిర్మాత సైతం డైరెక్ష‌న్లు చేసేస్తున్నారని వినికిడి. ఓరోజు ఓ సీన్ తీస్తే… రాత్రికి ర‌షెష్ చూసుకుని, మ‌ళ్లీ ఉద‌యాన్నే రీషూట్లు కూడా మొద‌లెడుతున్నార్ట‌. ఎంత క‌ష్ట‌ప‌డినా, ఎంత‌మంది ద‌ర్శ‌కులైనా.. సినిమాకి అవుట్ పుట్ బాగా రావ‌డం ప్ర‌ధానం. ఇంత‌మంది వంట‌గాళ్లు చేరి, వండేస్తున్న ఈ వంట‌.. ఎలా త‌యార‌వుతుందో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ బీజేపీకి దారి చూపిన రఘురామకృష్ణరాజు !

వైసీపీ సర్కార్‌పై ఎలా పోరాడాలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ బీజేపీ నేతలకు దారి చూపారు. ఆ దారిలో సోము వీర్రాజు అండ్ బృందం విమర్శలు ప్రారంభించారు. వైఎస్ జగన్‌కు డబుల్,...
video

బంగార్రాజు నుంచి బ్యూటీఫుల్ మెలోడీ

https://www.youtube.com/watch?v=d9eINA5rgzI సంక్రాంతి బరికి సిద్దమౌతున్న మరో సినిమా నాగార్జున 'బంగార్రాజు'. సోగ్గాడే చిన్ని నాయనాకు ఫ్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య కూడా ప్రధాన పాత్ర పోహిస్తున్నాడు. ఇప్పటికే చైతు పై విడుదల...

వేరే మహిళలకు లేనివి నాకేమైనా ఉన్నాయా ? : పాయల్

ఓ ఫోటో షూట్ విషయంలో తనను ట్రోలింగ్ చేస్తున్న వారికి హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కడిగిపడేసింది. వేరే మహిళలకు లేనివి తనకు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించింది. ఎందుకంటే ఇటీవల పాయల్ రాజ్‌పుత్...

“బియ్యం”పై ఇరుక్కుపోయిన టీఆర్ఎస్ ! వాట్ నెక్ట్స్ ?

వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ చాలా రాజకీయం చేస్తోంది. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు. కేంద్రం కొనబోమని ఎప్పుడూ చెప్పలేదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కానీ ఎంత కొంటామో చెప్పాలంటూ...

HOT NEWS

[X] Close
[X] Close