ఎపిటైమ్స్‌, రాజ్‌ టీవీ హడావుడి

ఇప్పటికి వున్న తెలుగు న్యూస్‌ ఛానళ్లలోనే పైనున్న నాలగు అయిదు తప్ప తక్కినవన్నీ తంటాలుపడుతూనే వున్నాయి. ప్రభుత్వాలు ప్రేమతో భారీ యాడ్లు కేటాయిస్తే తప్ప వాటికి మనుగడే వుండదు. చాలా ఆర్బాటంగా మొదలైనవి కొన్ని మూతపడగా కొన్ని వున్నామనిపించుకుంటున్నాయి. టీవీ9,ఎన్‌టివి, టివీ5, 10టీవీ, వి6, ఎబిన్‌, ఏలిన వారి అండతో టి ఛానల్‌ మినహాయస్తే మరే తెలుగు న్యూస్‌ ఛానల్‌ పరిస్థితీ సంతృప్తిగా లేదు. చంద్రబాబు అధికారంలోకి రావడం ఎబిఎన్‌కు కలిసొచ్చిందనేది బహిరంగ రహస్యం. వి6 ముందునుంచి ఎలాగో ఆకట్టుకుంటున్నది. ఈ నేపథ్యంలో పూర్వపు సిఇవో కమ్‌ ఎడిటర్‌ వెంకటకృష్ణ తలపెట్టిన ఎపి టైమ్స్‌ సిబ్బంది కోసం అడ్వర్టయిజ్‌మెంట్‌ చేసింది. ఆంధ్ర నుంచి వచ్చే తొలి శాటిలైట్‌ ఛానల్‌ అని దీన్ని ప్రచారం చేసుకుంటున్నారు. విభజన తర్వాత కూడా ప్రధాన చానళ్లన్నీ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ విజయవాడలో చర్చలు బైట్లు నడిపిస్తున్నాయి. సాక్షి, ఈనాడు ఉభయులకూ ఎపిపై ప్రత్యేకాసక్తి గనక కొంచెం పెద్ద స్టూడియోలు పెట్టుకున్నా ఇంకా వెళ్లిందేమీ లేదు. హైదరాబాదులో ఎపి ముద్ర వేగంగా తగ్గిపోయినా చర్చల వరకూ జరుగుతూనే వున్నాయి. శాసనసభ వున్నప్పుడో పెద్ద ఈవెంట్‌ జరిగినప్పుడో తప్ప సమస్య వుండటం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి తరలింపు లేదా రెండవ విభాగం ప్రారంభం చేయొచ్చని ఎక్కువ ఛానళ్లు ఆలోచిస్తున్నాయి. పైగా ఎవరైనా అక్కడ హడావుడిగా అరకొరగా స్టూడియో పెట్టినా గొప్పగా సాధించేదేమీ వుండదని కూడా పరిశీలకులు చెబుతున్నారు. కాకుంటే ప్రభుత్వ అండదండలుంటే అడ్వర్టయిజ్‌మెంట్ల ఆదాయం పెరగొచ్చు.

ఇక తెలంగాణలో తానూ ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకుంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందుకోసం ఒక టీవీ ఛానల్‌ చేతిలో వుండాల్సిన అవసరం గుర్తించారు. టి న్యూస్‌కు ముందు రాజ్‌ టివి పేరుతో టిఆర్‌ఎస్‌ ప్రధాన సమాచారం వస్తుండేది. తర్వాత దాన్ని కొందరు నామకార్థంగా నడిపిస్తున్నా పెద్ద ప్రభావం లేదు. ఇప్పుడు కోమటిరెడ్డి దాన్ని పున:ప్రారంభించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సిబ్బందినే గాక ఒక హెడ్‌ను కూడా తీసుకున్నారు. మిగిలిన వారికి మాత్రం జూన్‌ తర్వాత రావాలని చెబుతున్నారట. అధికారం వున్నా టిన్యూస్‌ అంతంత మాత్రంగానే నడుస్తున్నదనే అసంతృప్తి టిఆర్‌ఎస్‌లో వుంది. ఇంతలో అది మారే అవకాశం కూడా లేదు. మరి టిన్యూస్‌ పరిస్థితే ఇలా వుంటే రాజ్‌ వచ్చి చెప్పేది ఏముంటదనే ప్రశ్న మీడియా వర్గాల్లో వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com